నాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాల తో సత్తా చాటిన డైరక్టర్ వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో వస్తున్న సినిమా అంటే సుందరానికీ. ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ ఇద్దరు వేరు వేరు మతాలకు సంబందించిన వ్యక్తులుగా కనిపించనున్నారు. ఇలా మతాలు వేరైన వ్యక్తుల మధ్య జరిగిన ప్రేమ కథే అంటే సుందరానికీ సినిమా. అయితే ఈ సినిమా టీజర్, ట్రైలర్ లో అంటే అంటే అని ఆడియెన్స్ ని సస్పెన్స్ లో ఉంచారు డైరక్టర్. ఇంతకీ సుందరానికి అసలు సమస్య ఏంటని అందరు డౌట్ పడుతున్నారు.

ఈ క్రమంలో అంటే సుందరానికీ సినిమా నుండి ఓ పెద్ద మ్యాటర్ లీక్ అయ్యింది. సినిమాలో నాని నపుంసకుడి గా కనిపిస్తారట. ఏంటి నాని ఏంటి అలా నటించడం ఏంటని అనుకోవచ్చు. జస్ట్ వారి ప్రేమని గెలిపించుకోవడం కోసం నాని అలా నపుంసకుడిని అని ఫ్యామిలీకి చెబుతాడట. సో అదే అంటే సుందరానికీ అసలు మ్యాటర్ అని చెబుతున్నారు. ఇంతకీ ఈ లీక్ అయిన మ్యాటర్ సినిమా కు సంబందించినదా కాదా అనది జూన్ 10న సినిమా చూస్తే తెలుస్తుంది.

లాస్ట్ ఇయర్ చివర్లో శ్యామ్ సింగ రాయ్ సినిమాతో హిట్ అందుకున్న నాని అంటే సుందరానికీ సినిమాతో కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందని. ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా చూసే సినిమా ఇదని అంటున్నారు. ఈ సినిమాపై నాని చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. తప్పకుండా నాని తన మార్క్ చూపించేలా ఈ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. ఈ మూవీ తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో దసరా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో నాని కంప్లీట్ గా మాస్ యాంగిల్ లో కనిపించనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: