ఇటీవలి కాలంలో ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు ఇద్దరూ కలిసి నటించడం లేదా ఒకరు హీరోగా నటిస్తే మరొకరు విలన్ గా నటించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇలా వరుసగా మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు ఇలాంటి మల్టీస్టారర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విక్రమ్. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మక్కాల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది అన్న విషయం తెలిసిందే.


 ఇప్పటికే ఖైదీ, మాస్టర్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన లోకేష్ కనకరాజు ఇక ఇప్పుడు విక్రమ్ అనే సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసేసాడు అనే చెప్పాలి. భారీ అంచనాల మధ్య జూన్ 3వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించి ఇక భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా లో 67 ఏళ్ల వయసులో కూడా కమల్ హాసన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బుర పరిచాయి. అయితే సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఇక చివర్లో సూర్యా ఒక డిఫరెంట్ గెటప్ లో పవర్ఫుల్ పాత్రలో కనిపించడం మరో ఎత్తు అని చెప్పాలి.



 ఇక సూర్య పాత్రతో విక్రమ్ సినిమా ఒక లెవెల్ లోకి వెళ్లి పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కనిపించింది కొంతసేపయిన పవర్ఫుల్ పాత్ర మాత్రం ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఈ పాత్ర కోసం సూర్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయిందట. అయితే స్టార్ హీరో సూర్య విక్రమ్ సినిమాలో నటించడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. కమల్ సినిమా కావడంతో మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకొని షూటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాడట. కానీ రెమ్యూనరేషన్  గురించి ఎక్కడ అడగలేదట.  ఇక ఈ విషయం తెలిసి అభిమానులు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: