టాలీవుడ్
సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఉంది సమంత. వివాహం తర్వాత సినిమాల నుంచి దాదాపుగా తప్పుకున్నట్లు ఆమె వ్యవహరించింది కానీ విడాకుల తర్వాత మళ్ళీ తన
సినిమా కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు మరిన్ని సినిమాల్లో నటించడానికి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరిస్తూ మునుపటిలా తన కెరీర్ మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం 2 లేడీ ఓరియెంటెడ్ సినిమాలో పాటు కొంతమంది పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది.
ఇటీవల తమిళనాడులో
విజయ్ సేతుపతి తో కలిసి నటించిన
సినిమా ఆమెకు పెద్దగా ఉపయోగపడే లేదనే చెప్పాలి. దాంతో ఆమె ఇప్పుడు చేస్తున్న
విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఇటీవలే కాశ్మీర్లో ఈ
సినిమా యొక్క మొదటి షెడ్యూల్ పూర్తి కాగా ఇప్పుడు హైదరాబాదులో రెండవ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టుకుంది.
డిసెంబర్ 23వ తేదీన ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఆమె
బాలీవుడ్ లో వచ్చిన ఓ అవకాశాన్ని చేజేతులా వదులుకోవడం తో ఆమె పెద్ద తప్పు చేసిందని అభిప్రాయాలు ఎక్కువగా వినబడుతున్నాయి.
అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన సినిమాలో మొదట
హీరోయిన్ గా
సమంత కే అవకాశం వచ్చింది. అయితే ఆమె అవకాశాన్ని తిరస్కరించింది. కారణం ఏదైనా ఆమె ఆ
సినిమా కి నో చెప్పి పెద్ద తప్పు చేసింది అని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు ఆ
సినిమా చేసి ఉంటే ఆమె క్రేజ్ వేరే స్థాయిలో ఉండేది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ముందుకు రాగా అది సినిమాపై అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. షారుఖ్ తో నటించే అవకాశాన్ని వదులుకోవడం నిజంగా ఆమె కెరీర్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.