ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద తన రేంజ్ ఏంటో చూపిస్తోంది. తాజాగా వచ్చిన కలెక్షన్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. లేటెస్ట్ అప్ డేట్ కమల్ మేనియా ఏవిధంగా ఉందో చెబుతోంది. విక్రమ్ కేవలం 2 రోజుల్లోనే గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ సర్కిల్ వార్తలు వినిపిస్తున్నాయి..తమిళ చిత్రాలలో ఇంత కలెక్షన్స్ ను అందుకున్న సినిమా ఇదే కావడం విశేషం.విక్రమ్‌లో స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ , సూర్య కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు.
అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంటున్నారు సినీ జనాలు. దశావతారం, విశ్వరూపం తర్వాత కమల్ కెరీర్‌లో 100 కోట్ల గ్రాస్ దాటిని మూడో చిత్రమిదే..చాలా గ్యాప్ తర్వాత కమల్ హాసన్ తనలోని నట విశ్వరూపాన్ని విక్రమ్‌లో చూపించాడని, గూస్ బంప్స్ తెప్పించేలా కొన్ని సన్నివేశాలున్నాయని చెబుతున్నారు మూవీ లవర్స్. మరి రాబోయే రోజుల్లో విక్రమ్ బాక్సాపీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు కమల్ ఫ్యాన్స్.. మొత్తానికి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిందని చెప్పాలి.