కొన్ని సినిమాలు థియేటర్లో అంత సక్సెస్ అందుకోకున్న కూడా నెట్ ఫ్లిక్స్ లో మాత్రం బాగా హిట్ అయ్యి మంచి సక్సెస్ లు అందుకుంటాయి.మరికొన్ని సినిమాలు థియేటర్ లతో పాటు నెట్ ఫ్లిక్స్ లో కూడా హిట్ అయ్యి మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఇక మొన్నటి వరకు కూడా నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా నెంబర్ వన్ ట్రెండ్ గా బాగా వెలిగింది. డైరెక్టర్ యస్ యస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతంలో థియేటర్ లలో విడుదలయ్యింది. ఇక విడుదల రోజే ఈ సినిమా సెన్సేషనల్ హిట్ ని క్రియేట్ చేసుకుంది.మొత్తానికి భారీ వసూళ్లతో ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. పలు భాషల్లో విడుదలై మంచి ప్రేక్షకాదరణ కూడా పొందడంతో నెట్ ఫ్లిక్స్ లో కూడా హిందీ వెర్షన్ లో విడుదల చేశారు. దీంతో నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమా చాలా బాగా సందడి చేసింది.


మొన్నటి వరకు కూడా నెంబర్ వన్ గా ట్రెండ్ అయింది.అయితే తాజాగా ఈ సినిమా సెకండ్ ట్రెండ్ కు దిగిపోయింది. కారణమేంటంటే ఇటీవలే విడుదలైన జనగణమన సినిమా అని చెప్పాలి.డీజో జోస్ ఆంటోని దర్శకత్వంలో రూపొందిన సినిమా ఈ 'జనగణమన'. ఈ సినిమాల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంకా అలాగే సూరజ్ వెంజారామూడ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా మలయాళం భాషలో రూపొందింది. ఈ సినిమాను పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంకా లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. అలాగే శ్రీ దివ్య హీరోయిన్ గా నటించగా ధ్రువన్, షమ్మీ తిలకన్, రాజా కృష్ణమూర్తి, వినోద్ సాగర్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా దిశ ఎన్ కౌంటర్ ఆధారంగా మరో నేపథ్యంతో ఇంకా కథాంశంతో తెరకెక్కింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి చాలా బాగా ఆసక్తి చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: