ఇక ఈ గ్లింప్స్ విషయానికి వస్తే.. మంచుకొండల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నిఖిల్ లుక్ బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మంచు కొండల మధ్య ఉన్న బాక్స్ లో నుంచి ఒక వెపన్ తీసి ఏదో సమరానికి సై అన్నట్లు గా వెళుతున్నాడు నిఖిల్ ఈ సన్నివేశాన్ని ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇక గూడచారి, ఎవరు, హీట్ వంటి చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన గ్యారీ బి హెచ్ ఈ సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉండడం విశేషం
దీంతో ఈ సినిమాలు తాలూకు లక్షణాలు కూడా అలాగే స్పష్టంగా కనిపిస్తున్నాయి.స్పై ఈ సినిమాతో నిఖిల్ మరొక విషయాన్ని పక్కాగా అందుకుంటాడు అని చెప్పవచ్చు ఇక ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. కే రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్ జూలియన్ అమరు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తూ ఉండడం గమనార్హం. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం తెలుగులో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.