నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో తెరకెక్కిన అంటే సుందరానికీ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే సుందరానికీ సినిమాతో నాని ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. అంటే సుందరానికీ కంప్లీట్ ఫ్యామిలీ మూవీ.
అంటే సుందరానికీ సినిమా తెలుగుతో పాటుగా కన్నడ, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్యాం సింగ రాయ్ సినిమా తర్వాత నాని చేస్తున్న ఈ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. తప్పకుండా నాని ఈ సినిమాతో మరో హిట్ అందుకునేలా ఉన్నాడని అంటున్నారు. సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించగా అంటే సుందరానికీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. నాని, నజ్రియాల జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. అంటే సుందరానికీ సినిమా తర్వాత నాని దసరా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో నాని కంప్లీట్ గా ఊర మాస్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.