బాహుబలి సినిమా తో రాజమౌళి తెలుగు సినిమా తెరకెక్కే విధానాన్ని పూర్తిగా మార్చేశాడు. అలా అందరి హీరోలు దర్శకులు పాన్ ఇండియా మార్కెట్ లో చోటు సం పాదించుకోవడం కోసం చూస్తుంటే వారిబాటలో మహేష్ కూడా ఈ సినిమా తో నడుస్తున్నాడు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా మహేష్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
రాజమౌళి సినిమా అంటే ఎంత ఆలస్యంగా తెరకెక్కిస్తాడో తెలిసిందే. అయితే రాజమౌళి ఈ సినిమా ను త్వరగా చేయాలనీ భావిస్తున్నాడు. ఈ సినిమా కోసం రాజ మౌళి కొన్ని స్పెషల్ ఎట్రాక్షన్స్ ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ దాస్ ను ఎంపిక చేశాడట. అంతేకాదు అడివి శేష్ కూడా ఈ సినిమా లో ఓ కీలక పాత్ర లో నటించబోతున్నాడట. సాహో సినిమా తర్వాత ఆమె తెలుగు పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు మహేష్ సినిమాలో ఆమె నటించడం సినిమాపై మరింత అంచనాలు పెంచుతుంది.మరి ఈ సినిమా మొదలయ్యే నాటికి ఇంకా ఎన్ని స్పెశాల్స్ను అయన ఈ సినిమా లో నెలకొల్పేలా చేస్తాడో చూడాలి మరీ.