బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం అఖండ.. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే ఏకంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్ వసూలు చేసి మరింత విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య తన తర్వాత సినిమా అంతకుమించి ఉండేలా అని చెప్పడంతో గోపీచంద్ మలినేని ఊహించని విధంగా అద్భుతమైన కథను బాలయ్య కోసం రూపొందించడం జరిగింది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా చూసినవారి వెన్నులో భయం పుడుతుంది.

పోస్టర్ చూసిన వెంటనే ఇది పక్కా మాస్ చిత్రం అని చెబుతూనే మరోపక్క ఆర్జివి సినిమా ను తలపించేలా ఉండబోతోంది అని కొంత మంది నెటిజన్లు వాపోతున్నారు. షూటింగ్ పనులు కొంచెం ఆలస్యం అయినప్పటికీ మొత్తానికి అయితే షూటింగ్ కంప్లీట్ చేశాడు గోపిచంద్ మలినేని. ఇందులో బాలయ్య లుక్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. గతంలో బాలయ్య సూపర్ హిట్ చిత్రాలకు సంబంధించి బాలయ్య లుక్ కు ధీటుగా ఈ సినిమాలో బాలయ్య లుక్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య బాబు ను మరొకసారి అఖండ సినిమాలో లాగే #NBK 105 సినిమాలో కూడా మాస్ ఎలివేషన్స్ చూపించడానికి సిద్ధమవుతున్నాడు గోపీచంద్ మలినేని.పోస్టర్ ని చూస్తుంటే గోపీచంద్ మలినేని ఒక రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలతో బాలయ్య ని చూపించినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ ని చూస్తుంటే బోయపాటినే గోపీచంద్ మలినేని మించిపోయేలా కనిపిస్తున్నాడు. ఇకపోతే ఈ పోస్టర్ ని మనం గమనించినట్లైతే పులిచెర్ల నాలుగు కిలోమీటర్లు అని రాసిన ఒక మైలురాయిని మనం చూడవచ్చు. అంతేకాదు దానిపైన భయంకరమైన రక్తపు మరకలు..పక్కన డిజైన్ చేసిన గొడ్డలి ని చూస్తుంటే పక్కా మాస్ చిత్రంగా తలపిస్తోంది . ఏది ఏమైనా నందమూరి అభిమానులకు ఈ సారి మరో పక్క మాస్ జాతర జరగబోతోందని స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: