అలాంటి మ్యాజిక్ హిట్ మరోసారి కొట్టాలని తప్పకుండా ఈ కాంబో లో సినిమా వస్తే అలాంటి విజయం వస్తుందని భావించారు కానీ ఇద్దరు వేరు వేరు ప్రాజెక్ట్ లు చేయడం వల్ల అది కుదరలేదు. ప్రస్తుతం వీరి కలయికలో ''భవదీయుడు భగత్ సింగ్'' అనే చిత్రాన్ని ప్రకటించారు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క లుక్స్ విడుదల కాగా అవి సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే అప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్లకపోవడంతో అందరు ఈ సినిమా పై నెగెటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేశారు.
అసలు ఈ సినిమా ఉంటుందా అన్న అనుమానాలను వ్యక్తపరిచారు. అయితే వాటన్నిటికీ సమాధానం ఇస్తూ హరీష్ శంకర్ ఈ సినిమా ఖచ్చితంగా ఉంది అని కుండబద్ధలు కొట్టేశారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన అంటే సుందరానికి సినిమా ప్రీ రిలీజ్ వేడుక లో అయన ఈ విషయాన్నీ వెల్లడించారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టుకుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో డైలాగ్స్ చాలాబాగున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఏ లెవెల్ లో తెరకెక్కుతుందో చూడాలి.