నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. వికృత పాత్రలలో సైతం అద్భుతంగా నటించిన బాలకృష్ణ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు.ఈ తరం హీరోలుగా ఎలాంటి పాత్ర అయినా చేయగలిగిన అతి కొద్ది మంది స్టార్ హీరోలలో బాలకృష్ణ ఒకరని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలకృష్ణ ఎక్కువగా మాస్ చిత్రాలని ఎంచుకుంటూ ఉన్నారు. అయితే తన తండ్రి అయిన సీనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో ఎన్నో చిత్రాలలో అద్భుతంగా నటించారు. అయితే ఎన్టీఆర్ కొన్ని పాత్రల్లో నటించాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాటిలో నటించ లేకపోయారట.
రామానుజాచార్యులు జీవిత కథలో నటించాలని సీనియర్ ఎన్టీఆర్ భావించగా ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఇది సాధ్యపడలేదట.. అయితే తన తండ్రి నటించ లేకపోయినా ఆ చిత్రాలను నటిస్తానని బాలకృష్ణ కొన్ని సందర్భాలలో తెలియజేయడం జరిగిందట.. పంచాక్షరి మంత్రము అందరికీ ఉపదేశించి రామానుజాచార్య పాత్రలో తాను నటిస్తానని తన తండ్రి కోరికను తాను ఎప్పటికైనా నిర్వహిస్తానని బాలయ్య గతంలో కూడా పలుసార్లు తెలియజేయడం జరిగింది. మరి బాలయ్య ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఆయన అభిమానులు అంటున్నారు. ఎన్టీఆర్ కు సాధ్యం కానిది తనకు సాధ్యమవుతుందా లేదో మరి తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
బాలకృష్ణ చివరిగా అఖండ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు ఈ సినిమా తక్కువ టికెట్లు రేట్లతో ఏకంగా రూ.200 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లను సాధించింది. బాలయ్య తన తదుపరి చిత్రాన్ని 300కోట్ల రూపాయల కలెక్షన్లు సొంతం చేసుకుంటారు అని ఆయన అభిమానులు కూడా భావిస్తున్నారు .బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయం మరొకసారి వైరల్ గా మారుతోంది. బాలకృష్ణ తన తదుపరి చిత్రానికి సంబంధించి టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ టీజర్ అత్యధికంగా 3.5 మిలియన్ వ్యూస్ ను రాబట్టడం విశేషం.
బాల కృష్ణ రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి డిమాండ్ చేయడం లేదని ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తోంది. ఒక్కో చిత్రానికి బాలకృష్ణ కేవలం రూ. 12 కోట్ల రూపాయలని అందుకుంటున్నట్లు సమాచారం. సినిమా సినిమాకు బాలకృష్ణ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.