ఆ తర్వాత పలు సందర్భాలలో ఎంటర్టైన్ మెంట్ కు స్టాప్ ఉండదనే విషయాన్ని కూడా తెలియజేశారు. దాంతో ఇప్పుడు సీజన్-2 మరి కొద్ది రోజుల తరువాత ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అన్నట్లుగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. బాలయ్య సీజన్ వన్ ముగిసి.. చాలా నెలలు కావస్తోంది. సీజన్ టు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందని సమాచారం. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది దసరా సందర్భంగా సీజన్-2 కి సంబంధించి మొదటి ఎపిసోడ్ విడుదల చేయబోతున్నట్లు ఆహా నుంచి , బాలయ్య సన్నిహితుల నుండి ఈ సమాచారం అందుతోంది.
తాజాగా అహ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో కూడా బాలయ్య పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర గురించి బాలయ్య బాబుని ప్రశ్నించగా చాలా పాజిటివ్ గా చెప్పడం జరిగింది. తప్పకుండా ఒక మంచి సీజన్ ను అన్ స్టాపబుల్ ప్రేక్షకులకు అందించ బోతున్నట్లుగా తెలియజేశారు బాలయ్యబాబు. సీజన్ టు ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది అనే విధంగా ఒక అప్డేట్ రావడం జరుగుతోంది. మరొక విషయం ఏమిటంటే ఇందులో చిరంజీవి మొదటి సారి గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం.