బ్యూటీ విత్ బ్రెయిన్ అనే మాటకి పర్ఫెక్ట్ ఎగ్జంపుల్ మాళవిక శర్మ. లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే సినిమాల్లోకి వచ్చింది. రవితేజతో కలిసి 'నేలటిక్కెట్టు' సినిమా చేసింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఆ తర్వాత రామ్‌తో కలిసి చేసిన 'రెడ్' పెద్దగా సక్సెస్ తీసుకురాలేదు. దీంతో సైలెంట్ అయిపోయింది మాళవిక.
ఇస్మార్ట్ బ్యూటీగా తెలుగు కుర్రాళ్లకి కనెక్ట్ అయ్యింది నిధి అగర్వాల్. ఈ సక్సెస్‌తోనే తెలుగుతో పాటు తమిళ్లోనూ సినిమాలు చేస్తోంది. అయితే శింబుతో చేసిన 'ఈశ్వరన్', జయం రవితో చేసిన 'భూమి' ఫ్లాప్ అయ్యాయి. ఇక మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌తో చేసిన 'హీరో' కూడా బోల్తాపడింది. వరుస ఫ్లాపులతో స్లో అయిన నిధి ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో కలిసి 'హరిహర వీరమల్లు' సినిమా చేస్తోంది.
కమర్షియల్ సినిమాల్లో మాస్ యాక్షన్ హీరో చూసుకుంటే, స్క్రీన్‌ని కలర్‌ఫుల్‌గా మార్చాల్సిన బాధ్యత హీరోయిన్‌ది. అందుకే స్కిన్‌షోకి, బోల్డ్ రోల్స్‌కి ఓకే చెప్పే హీరోయిన్లకి భారీగా ఆఫర్స్ వస్తుంటాయి. అయితే యాక్టింగ్‌ని పక్కనపెట్టి, గ్లామర్‌ని నమ్ముకున్న హీరోయిన్లలో చాలామంది కెరీర్ సమస్యల్లో పడిపోతోంది.
నభా నటేశ్ 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. రవితేజతో చేసిన 'డిస్కోరాజా' డిజాస్టర్ అయ్యింది. సాయి ధరమ్‌తేజ్‌తో కలిసి చేసిన 'సోలో బ్రతుకే సో బెటర్' ఓకే అనిపించుకున్నా ఆ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో చేసిన 'అల్లుడు అదుర్స్' ఫ్లాప్ అయ్యింది. నితిన్ మ్యాస్ట్రో ఓటీటీలో రిలీజ్ కావడంతో నభాకి పెద్దగా మైలేజ్ కూడా రాలేదు.
పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ మూవీ 'ఆర్.ఎక్స్.100'తో బోల్డ్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది. యూత్‌కి ఫుల్లుగా కనెక్ట్ అయ్యింది. అయితే ఆ తర్వాత పాయల్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫట్‌మన్నాయి. రవితేజతో చేసిన 'డిస్కోరాజా', వెంకటేశ్‌తో చేసిన 'వెంకీమామ' బోల్తా పడ్డాయి. పాయల్ ఆశలకి బ్రేకులు పడ్డాయి. ఈ టఫ్ సిట్యువేషన్లో ఆది సాయి కుమార్‌తో 'కిరాతక', మంచు విష్ణుతో గాలి నాగేశ్వర్రావు సినిమాలు చేస్తోంది.
ప్రగ్యా జైశ్వాల్ గ్లామర్‌రోల్స్‌కి ఎప్పుడూ నో చెప్పింది లేదు. బోల్డ్‌గా కనిపించడానికి, సెకండ్ హీరోయిన్ రోల్స్ చేయడానికి ఓకే అంటుంది. కానీ ఈ హీరోయిన్‌ని మాత్రం స్టార్లు కన్సిడర్ చేయట్లేదు. 'అఖండ' హిట్ అయినా ప్ర్గగ్యాకి పెద్దగా ఆఫర్స్ రాట్లేదు. ఇప్పటికీ కెరీర్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూనే ఉంది.