యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తూ వస్తున్నాడు.బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా అనుకున్న హిట్ ను అందించలేక పోయాయి.దీంతో డార్లింగ్ రొమాంటిక్ , ఫ్యామిలీ కథా చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.. బాలివుడ్ లో కూడా ఇటీవల ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ K ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాల్లో ఆదిపురుష్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది..


ఇక మిగిలిన రెండు సినిమాలు మాత్రం షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఈ సినిమాలతో పాటు మరో దర్శకడు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు..ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కుతుందో లేదో అని అందరూ సందేహిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే కమిట్ అయిన రెండు భారీ ప్రాజెక్టులు ఇంకా షూటింగ్ జరుపుకుంటుండటంతో మారుతితో సినిమా ఇప్పట్లో వస్తుందో లేదో అని అనుకుంటున్నారు.


అయితే.. అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చేలా, ప్రభాస్ ఈ సినిమాను చాలా స్పీడుగా ప్రారంభించడమే కాకుండా అంతే స్పీడుగా ముగించాలని చూస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను వచ్చే వేసవి తరువాత స్టార్ట్ చేసి 2024 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ప్రభాస్ ఆలొచిస్తున్నాడని తెలుస్తుంది.సలార్ చిత్రాన్ని ముగించేసి, రిలీజ్‌కు రెడీ చేయాలని ఆయన భావిస్తున్నాడట. అయితే మారుతి సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని, ఈ సినిమా లో ప్రభాస్ అల్టిమేట్ కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఈ సినిమా అన్నా కరెక్ట్ టైం కు రిలీజ్ అవుతూందా లేదా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: