ఈటీవీ లో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులందరికీ అదిరిపోయే కామెడీ పంచుతూ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది జబర్దస్త్ కార్యక్రమం. ఇక జబర్దస్త్ కార్యక్రమం ప్రేక్షకులను నవ్వించడంలోనే కాదు ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది.  అయితే ఇటీవలి కాలంలో జబర్దస్త్ కామెడీ షో లో ఎన్నో మార్పులు జరిగి పోతున్నాయి. జబర్దస్త్ ద్వారా టాప్  కమెడియన్ లుగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ ను విడిపోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 అయితే ఇటీవలే సినిమాల్లో బిజీ అవ్వడం కారణంగానే సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు అంటూ కొంత మంది అనుకుంటున్నారు. జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన గెటప్ శీను సుడిగాలి మళ్ళీ షో లోకి రావాలని అటు ప్రేక్షకులు అయితే బలంగానే కోరుకుంటున్నారు అని చెప్పాలి. ఇక సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోవడంతో ప్రస్తుతం రాంప్రసాద్ ఒకటే జబర్దస్త్ స్కిట్లు చేస్తున్నాడు. దీంతో సుధీర్ గెటప్ శ్రీను లాగా ఆటో రాంప్రసాద్ కి సినిమా ఆఫర్లు రాలేదా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి అని చెప్పాలి.



 అయితే జబర్దస్త్ నుంచి వెళ్ళిపోకుండా రాంప్రసాద్ కొనసాగడానికి వెనుక కారణం రాంప్రసాద్ కు సంబంధించిన వారు జబర్దస్త్ డైరెక్షన్ టీమ్ లో ఉండడమే అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ కారణమే రాంప్రసాద్ జబర్దస్త్ ని వీడకుండా ఆపుతుంది అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా మల్లెమాల వారితో రాంప్రసాద్ కు కాస్త సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. అందువల్ల గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ వెళ్ళిపోయినా కూడా రాంప్రసాద్ ఇంకా జబర్దస్త్ లో కొనసాగుతున్నాడట. ఏది ఏమైనా ఇక రాంప్రసాద్ కూడా జబర్దస్త్ లో ఒంటరి వాడిని అయిపోయాను అంటూమొన్నటికి మొన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: