ఆమె మరింతగా తెలుగు వారికి ఘాటు సమాధానాలు ఇస్తుండటంతో ఆమె నటించిన సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది అంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు సమంత పై ఇప్పటికే పీకలలోతు కోపం ఉండి ఉంటుంది. ఎందుకంటే చాలా ఇన్నోసెంట్ అయిన నాగ చైతన్య ను సమంత మోసం చేసి విడి పోయింది. ఆమె అత్యుత్సాహం వల్ల నాగ చైతన్య జీవితంలో చాలా మిస్ అయ్యాడు అనేది తెలుగు వారు.. ముఖ్యంగా అక్కినేని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆమెను తెలుగు లో చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే అదే వంద కోట్ల సినిమాలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి..
గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమా ను భారీ ఎత్తున గ్రాఫికల్ విజువల్ వండర్ గా చూపించేందుకు గాను దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. మరో వైపు లేడీ ఓరియంటెడ్ మూవీ యశోద కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ రెండు సినిమా లు కూడా దాదాపుగా వంద కోట్ల వరకు వసూళ్లు చేసే అవకాశం ఉంది. అంతకు మించి కూడా రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తెలుగు వారితో సున్నం పెట్టుకుంటే.. తెలుగు ప్రేక్షకుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ రెండు సినిమాల నిర్మాతలు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..