ఇదిలావుంటే అల్లూరిగా రామ్‌చరణ్, భీమ్‌గా ఎన్టీఆర్ ఆయా పాత్రల్లో ఒదిగిపోగా.. రాజమౌళి తెరకెక్కించిన విధానం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ చిత్రం. ఇకపోతే బలమైన కథకు విజువల్ ఎఫెక్ట్స్‌ను జోడించి కొత్త అనుభూతిని పంచారు దర్శకుడు రాజమౌళి. ఇక ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే.ఇదిలావుంటే సినిమాలో క్లైమాక్స్‌లో ‘ఫారెస్ట్ ఫైట్’ విజువల్స్‌కు సంబంధించిన వీడియో విడుదలైంది.
అయితే 'మకుట విజువల్ ఎఫెక్ట్స్' సంస్థ ఆ ఫైట్ సీన్‌కు సంబంధించి విజువల్స్‌ను జోడించింది.ఇకపోతే దీనికోసం ఆ సంస్థ 240 షాట్స్‌ను క్రియేట్ చేసింది. కాగా ఈ మేకింగ్ వీడియోను చూస్తే ఎవరైనా అబ్బా అనాల్సిందే. పోతే థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. ఇక అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా 'ఆర్‌ఆర్‌ఆర్' రికార్డు కొట్టినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అంతేకాదు అలాగే ఈ మూవీమరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి..!!