చరణ్ జూనియర్ రాజమౌళి ల కాంబినేషన్ కేవలం సినిమాకు మాత్రమే కాకుండా వారి ముగ్గురు మధ్య ఉన్న స్నేహ బంధాన్ని వ్యాపార రంగానికి కూడ కొనసాగించే విధంగా ఒక మాష్టర్ ప్లాన్ తయారు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాల కంటే రెస్టారెంట్ ల బిజినెస్ చాల బాగుంది. మంచి బ్రాండ్ ఇమేజ్ తో మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టగలిగితే భాగ్యనగరంలో రెస్టారెంట్స్ బిజినెస్ కు మంచి భవిష్యత్ కనిపిస్తోంది.


ఇప్పుడు ఈ రంగం పైనే చరణ్ జూనియర్ రాజమౌళిల దృష్టి పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో రెస్టారెంట్ బిజినెస్ లో మంచి పేరు సంపాదించిన ఒక రెస్టారెంట్ చైన్ సంస్థతో భాగస్వామి అయి ‘ఆర్ ఆర్ ఆర్’ పేరుతో ఒక ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ను భారీ స్థాయిలో భాగ్యనగరంలో పెట్టే ఆలోచనలలో వీరు ఉన్నట్లు టాక్.


ప్రపంచంలోని అన్ని దేశాలలోని ప్రజలు ఇష్టపడే వెజిటేరియన్ మెనూ తో ఈ రెస్టారెంట్ లోని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయని టాక్ నడుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాధమిక చర్చలు పూర్తి అయ్యాయని మరో 6నెలల లోపు దీని విషయమై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. అయితే హోటల్ బిజినెస్ చాల కాంపిటీషన్ తో కూడుకున్న వ్యవహారం కావడంతో ఈవిషయమై ఆచితూచి అడుగులు వేయాలని వీరు ముగ్గురు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సీక్వెల్ తీయాలని అభిమానులు చాలాసార్లు రాజమౌళిని అడిగారు. అయితే ఆసినిమా కథ రీత్యా అలాంటి ప్రమోగం కుదరదు అనీ రాజమౌళి చెపుతూనే వచ్చాడు. ఇప్పుడు ఆ ‘ఆర్ ఆర్ ఆర్’ పేరు శాస్వితంగా జనం మర్చిపోకుండా ఉండాలని ఇలాంటి బిజినెస్ ప్రయోగం వీరు ముగ్గురు చేస్తున్నారు అనుకోవాలి. ప్రస్తుతం వీరు ముగ్గురు తమతమ సినిమాలతో చాల బిజీగా ఉండటంతో ఈ బిజినెస్ ఆలోచన కేవలం ఆలోచనలకే పరిమితం అవుతుందా లేక త్వరలో కార్యరూపం దాల్చుతుందా అన్న విషయం వేచి చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: