
ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఈ అమ్మడు ఇపుడు ముచ్చటగా మూడో పెళ్ళికి కూడా రెడీ అయిపోయింది అని తెలుస్తోంది. మొదట ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి పెళ్లి చేసుకున్న శ్రీజ ఆ తరవాత తండ్రి చిరంజీవి నచ్చచెప్పడంతో అతడితో విడాకులు తీసుకుని కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకున్నారు. అయితే గత కొంత కాలంగా వీరి మద్య కూడా మనస్పర్ధలు తలెత్తాయి అని ఇద్దరు గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు అని వినిపిస్తోంది. అంతేకాదు బయటకు చెప్పలేదు ఇప్పటికే వీరు విడాకులకు కూడా తీసుకుని విడిపోయారు అని సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా మరో న్యూస్ చిరు కుమార్తె శ్రీజ గురించి వైరల్ అయ్యింది.
శ్రీజ ఇపుడు మూడో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడిని శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. నిజానికి కళ్యాణ్ దేవ్ తో శ్రీజ విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ బయటకు రాకపోయినా వీరు విడిపోయింది మాత్రం నిజమే అంటున్నారు. ఇది నిజమే అన్నట్లుగా శ్రీజ గత కొంత కాలంగా కళ్యాణ్ దేవ్ గురించి ఎలాంటి పోస్ట్ ను తన సోషల్ మీడియాలో పంచుకోవడం లేదు. అదే కాకుండా ఆ మధ్య ఒకసారి నా పిల్లలే నా ప్రపంచం అంటూ సింగిల్ పోస్ట్ పెట్టడంతో అంతా వీరు విడిపోయారని అనుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు.. కానీ శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు మాత్రం జోరుగా ప్రచారం అవుతున్నాయి.