ఫిలిం ఇండస్ట్రీ లో వరుస బ్యాడ్ న్యూస్ లు అందుతున్నాయి.ఇటీవల కాలంలో ప్రముఖులను కరోనా కాటేసింది.ఎంతో మంది సీనియర్ ప్రముఖులు కరొన బారిన పడి, కొలుకున్న తర్వాత తీవ్ర అనారొగ్యానికి గురై మరణించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో వ్యక్తి మరణంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది.ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా భర్త కూడా కరోనా తో పోరాడి చనిపొయారు.ఈ వార్త తో సినీ ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగి పోయింది..



సౌత్ లో అగ్ర హీరోయిన్లలో మీనా కూడా ఒకరు.. ఆమె 2009లో బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ను వివాహం చేసుకున్నారు .తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన విద్యాసాగర్ తుదిశ్వాస విడిచినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి..కానీ అతను కొద్ది సంవత్సరాలను తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. పావురం రెట్టల ద్వారా సోకిన గాలిని పీల్చడం ద్వారా సంక్రమించిన అలెర్జీ ఇది. ఈ ఏడాది జనవరిలో మొత్తం కుటుంబం కోవిడ్ 19కి పాజిటివ్ పరీక్షించిన తర్వాత ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమైంది. విద్యాసాగర్ పరిస్థితి నుంచి వారు కోలుకున్నప్పటికీ, ఆ తర్వాత మళ్ళీ తీవ్ర అస్వస్థకు గురైయ్యారు.


చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యాసాగర్‌ను చేర్పించారు. అతనిని పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల మార్పిడి చేయాలనుకున్నారు. అయితే ఇది బ్రెయిన్‌ డెడ్‌ అయిన రోగుల నుంచి మాత్రమే సాధ్యమవుతందని చెప్పుకొచ్చారు. అయితే వారికి సరైన దాతలు లభించలేదు. దీంతో మందుల తోనే అతడి ఆరోగ్య పరిస్థితిని నయం చేయాలనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ మంగళవారం రాత్రి అతను కన్నుమూశారు. కాగా మీనా భర్త హఠాన్మరణంతో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. రాధికా శరత్‌కుమార్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు మీనా కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు..నేడు చెన్నైలోనే ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: