పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే..ఈసినిమాను కెజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు..సలార్' ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రభాస్ ను ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇప్పటివరకు వచ్చిన ప్రభాస్ సినిమాలు అన్నీ కూడా రోమాటింక్, యాక్షన్, కుటుంబ కథ లతో వచ్చాయి.


ఇప్పుడు వస్తున్న ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ ఉరమాస్ లుక్ లో కనిపించనున్నాడు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో ప్రతి అంశాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను చాలా పవర్‌ఫుల్ గా తీర్చిదిద్దుతున్న ప్రశాంత్ నీల్, ఇప్పుడు ఈ సినిమాలో మరో అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాలో ఓ రాకింగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సలార్ చిత్రంలో ఓ పవర్‌ఫుల్ కేమియో పాత్రలో రాకింగ్ స్టార్ యశ్‌ను తీసుకుచ్చేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట..ఈ విషయం పై గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇదే నిజమైతే మాత్రం ప్రేక్షకులను థియేటర్లలో ఆపడం ఎవరితరం కాదనే చెప్పాలి. కేజీయఫ్ చిత్రంతో యశ్, బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి నిజంగానే సలార్ చిత్రంలో ప్రభాస్ కోసం యశ్ రాకింగ్ సర్‌ప్రైజ్ ఇస్తాడా లేడా అనేది తెలియాలంటే ఈ సినిమా నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే. ఇక ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమా అన్నా ప్రభాస్ కు హిట్ టాక్ ను అందిస్తుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: