
అసోం రాష్ట్ర వ్యాప్తంగా నదులు పొంగి పోర్లుతుండటంతో పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. ఇప్పటికే ఎన్నో ఇల్లు నీట మునగడంతో అక్కడి వారు వరదల కారణంగా ఉండటానికి చోటు కూడా లేక పడరాని కష్టాలు పడుతున్నారు. ఈ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 2,389 గ్రామాలు నీటమునిగాయి.. అంటే వరద ఉదృతి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతో ప్రభుత్వం ఒక్కటే ఈ భారాన్ని మోయాలేకపోతోంది అని చెప్పొచ్చు. ఒక రకంగా వరద బాధితులకు పెద్దగా ప్రభుత్వం నుండి సాయం అందటం లేదని పలువురు వాపోతున్నారు. దాంతో భారీ వరదలతో సతమతమవుతున్న అసోంకు ఎంతో మంది దాతలు మేమున్నాం అంటూ ముందుకు వచ్చి సాయాన్ని అందిస్తున్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలను అందిస్తూ వరద బాధితులకు అందించాలని కోరుతున్నారు. తాజాగా ఆమీర్ ఖాన్ కూడా ఆ దాతల్లో ఒకరిగా చేరారు. అసోం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఏకంగా రూ. 25 లక్షలను విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆమిర్ కు భారీ మొత్తం లో విరాళాన్ని అందించి వారికి అండగా నిలిచినందుకు గాను కృతజ్ఞతలను తెలియచేసారు అసోం ముఖ్యమంత్రి. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రం లో భీబత్సం చేస్తున్న వరదలు ఇపుడు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది.