అల్లరి నరేష్ సినిమా కెరియర్ గాడిలోకి పడిందంటే నాంది సినిమా వల్లనే అని చెప్పాలి. కామెడీ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరించే నరేష్ అవే సినిమా లతో అందరినీ ఎంతగానో బోర్ కొట్టించాడు.  తన రెగ్యులర్ జోనర్ కాకుండా ఎప్పుడైతే నాంది లాంటి వెరైటీ కథ ఉన్న సినిమా చేశాడో అప్పుడే ఆయన విజయ యాత్రకు నాంది పలికిందని చెప్పాలి. ఆ సినిమా సాధించిన విజయం అల్లరి నరేష్ కెరీర్ ను నిలబెట్టిందని తప్పకుండా చెప్పవచ్చు.  ఆ విధంగా ఈ సినిమాతో దర్శకుడుగా సక్సెస్ అయ్యి విజయ కనకమేడల మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్నాడు.

 ఈ నేపథ్యంలోనే ఆయన తెరకెక్కించే తదుపరి సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. మొదట్లో తన రెండో సినిమా హీరో నాగ చైతన్య తో చేయాలని భావించాడు కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు. దాంతో మళ్లీ తనకు అవకాశం ఇచ్చిన హీరో అయిన అల్లరి నరేష్ తోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంకొక వైపు నాగచైతన్య ఈ దర్శకుడుని కాదని వెంకట్ ప్రభు తో సినిమా చేస్తుండగా విజయ్ కనకమేడల నరేష్ తో అనౌన్స్ చేశాడు. తన రెండవ సినిమా ఇప్పటికే మొదలు పెట్టడానికి సిద్ధమయ్యాడు.

 అల్లరి నరేష్ కూడా సభకు నమస్కారం అనే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే రెండు విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నారు. హీరోగా మళ్లీ స్పీడ్ పెంచిన అల్లరి నరేష్ ఈ సినిమాతో తన సక్సెస్ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు సినిమా లు కూడా సీరియస్ జోనర్ లో సినిమాలే అని తెలుస్తుంది.  మహర్షి సినిమాలో ఆయన నటించిన పాత్ర తర్వాత ఆయన ఈ విధమైన సినిమాలు చేయడం విశేషం. మరొకసారి నాంది తరహా లోనే నరేష్ ఇంటెన్స్ రోల్ లో నటించబోతున్నాడని ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను బట్టి తెలుస్తుంది.  మరి కామె లడీ ట్రాక్ నుంచి సీరియస్ ట్రాక్లోకి వచ్చిన ఈ హీరో ఈ ట్రాక్ లో ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు నరేష్ చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: