విభిన్నమైన సినిమాలతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు తమిళ హీరో ధనుష్. ప్రస్తుతం ఒక హాలీవుడ్ మూవీ లో నటిస్తున్నారు ఆ సినిమాని ద గ్రే మ్యాన్. ఈ సినిమా తో పాటు తమిళంలో మరో నాలుగు చిత్రాలలో నటిస్తు బిజీగా ఉన్నారు అందులో ఒకటి బైలింగ్వల్ సినిమా కూడా ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ నటిస్తున్న ఒక పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ సినిమాకు అరుణ్ మాదేశ్వర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 1930-40 కాలంలో మద్రాస్ ప్రెసిడెంట్ లో జరిగిన ఒక సన్నివేశం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది.



ఈ సినిమాకి కెప్టెన్ మిల్లర్ అనే టైటిల్ని కూడా చిత్ర బృందం ఖరారు చేశారు ఈ సినిమాకు సంబంధించి ఒక మోసం పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించడం జరిగింది భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమా సత్య జ్యోతి ఫిలిం బ్యానర్ పై త్యాగరాజ్ నిర్మిస్తున్నారు. ఇక సత్య జ్యోతి ఫిలిం బ్యానర్ తమిళ ఇండస్ట్రీలో మంచి మార్కులు ఏర్పరచుకుంది ఇక డైరెక్టర్ కూడా మంచి పేరు తెచ్చుకోవడంతో వీరిద్దరి కలయికలో ధనుష్ కెరియర్ లోని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.


ఈ టైటిల్ మోషన్ వీడియోలు ధనుష్ కెప్టెన్గా ముఖానికి ఒక స్కార్ఫ్ కట్టుకొని వెనకాల భుజంపై డబుల్ గన్ ధరించి బైక్ పైన ఎంతో స్టైలిష్ గా ఎంట్రీ ఇస్తున్న లుక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఒకేసారి తమిళ తెలుగు హిందీ భాషలలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఇక నిర్మాత త్యాగరాజు మాట్లాడుతూ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు హీరో ధనుష్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు డైరెక్టర్ కు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: