సొనాక్షి సిన్హా పెళ్లి గురించి చాన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. సీక్రెట్‌ లవ్‌స్టోరీ నడుపుతోందని త్వరలోనే పెళ్లి చేసుకుంటోందని ముంబయి జనాలంతా అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు సొనాక్షి మాత్రం ప్రేమ-దోమ ఏం లేదని కొట్టిపారేసింది. ఈ మధ్య సొనాక్షికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ  ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు జకీర్. అందులో ఐ లవ్‌ వ్యూ సొనాక్షి అని రాసుకొచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య లవ్‌ ఉందనే ప్రచారం మొదలైంది. జకీర్‌ అతని కంటే రెండేళ్లు పెద్దదైన సొనాక్షితో ప్రేమలో పడ్డాడనే టాక్ నడిచింది. సొనాక్షి వయసు 35 ఏళ్ళు. జకీర్‌కి 33 సంవత్సరాలు. మరి ఇప్పటవరకు ఇండస్ట్రీకి ఫ్రెండ్స్‌గా పరిచయమైన వీళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందా లేదా అనేది తెలియాలి.

మలైకా అరోరా అయితే ప్రేమ కోసం పెళ్లిని కూడా వదులుకుంది. భర్త అర్భాజ్‌ ఖాన్‌కి విడాకులు ఇచ్చి మరీ, అర్జున్‌ కపూర్‌తో రిలేషన్‌లో ఉంది. అర్జున్‌ తనకంటే 12 ఏళ్లు చిన్నోడు అయినా సరే, ఈ గ్యాప్‌తో పట్టింపులేకుండా ప్రేమ యాత్రలు చేస్తోంది. ఇద్దరూ కలిసి హాలిడే ట్రిప్పులు అంటూ తెగ తిరిగేస్తున్నారు. కానీ పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. బాలీవుడ్‌ మోస్ట్ లవింగ్ కపుల్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్‌. గతేడాది చివర్లో ఇద్దరూ ఒక్కటయ్యారు. లవ్‌స్టోరి గురించి ఎక్కడా మాట్లాడకుండా సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న వీళ్ల కథలో ఏజ్‌ గ్యాప్ లవ్‌ మాత్రం భారీగా సౌండ్‌ చేసింది. ఫిఫ్టీస్‌లో ఉన్న సల్మాన్‌ ఖాన్‌తో క్లోజ్‌గా మూవ్‌ అయిన కత్రీన కైఫ్‌ ఆమె కంటే 5 ఏళ్లు చిన్నోడైన విక్కీని పెళ్లి చేసుకుంటోందని కామెంట్ చేస్తున్నారు.  

ఐశ్వర్యా రాయ్ కనిపిస్తే చాలు ఇప్పటికీ రెప్పవాల్చని కళ్లు కోట్లలో ఉన్నాయి. ఇలాంటి ప్రపంచ సుందరి తన కంటే రెండేళ్లు చిన్నోడు అయిన అభిషేక్ బచ్చన్‌ని పెళ్లి చేసుకుంది. మిసెస్‌ చోటా బచ్చన్‌గా హ్యాపీ లైఫ్ లీడ్‌ చేస్తోంది. ఇక వీళ్లకి పెళ్లై 14 ఏళ్లు అవుతున్నా, ఇంకా ఈ కపుల్‌కి బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ ఉంది. వీళ్ల కాంబోలో సినిమాలు చెయ్యడానికి మేకర్స్ కథలు రాస్తూనే ఉన్నారు. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు ఫాలోయింగ్‌ ఉన్న ప్రియాంక చోప్రా కూడా తన కంటే చిన్నవాడినే పెళ్లి చేసుకుంది. ప్రియాంక భర్త అమెరికన్ సింగర్ కమ్ యాక్టర్ నిక్ జోనస్ ఈమె కంటే పదేళ్లు చిన్నోడు. వీళ్లిద్దరు కలిసి చేసే పాటలు, దిగే ఫోటోలకు సోషల్‌ మీడియాలో క్రేజీ రెస్పాన్స్‌ వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: