ది గ్రేట్ డైరెక్టర్ గా పేరు పొందిన దర్శకుడు మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం పొన్నియిన్ సెల్వన్ . ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించాలని ఎన్నో కలలు కన్నారు అనుకున్నట్టుగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఫేమస్ రైటర్ కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ తో పాటు మద్రాస్ టాకీ బానర్ పై మణిరత్నం నిర్మించడం జరుగుతోంది. ఇందులో హీరో విక్రమ్ కీలకమైన పాత్రల ఆదిత్య కళాకారుడుగా నటిస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్ల రూపాయలు పైనే ఉండబోతున్నట్లుగా సమాచారం.


ఈ చిత్రాన్ని కూడా బాహుబలి ,పుష్ప తరహాలో రెండు విభాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఒకేసారి అన్ని భాషలలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్లను చాలా వేగవంతం చేస్తున్నారు ఇందులో భాగంగా ఈ చిత్రంలో నటిస్తున్న ప్రతి ఒక్కరి పాత్రని ఒక్కొక్కటిగా విడుదల చేయడం జరుగుతుంది. ఈ రోజున తాజాగా టైటిల్ పాత్రధారి జయం రవి లుక్ ను పరిచయం చేయడం జరిగింది.ఇందులో జయం రవి అరుణ్ మోలివర్మన్ గా పొన్నియిన్ సెల్వన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. పాత్రకు సంబంధించి ఒక పోస్టర్ని మేకర్ సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. ఇక ఈయనని రాజ రాజ చోళుడుగా పరిచయం చేశారు. జయం రవి ఈ పోస్టర్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ పోస్టర్ విషయానికి వస్తే కవచం ధరించి బల్లెం చేత్తో పట్టుకొని ఒంటిపై రక్తపు మరకలతో పోరాడుతున్న యోధుడుగా జయం రవి కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల ముఖ్యఅతిథిగా మహేష్ బాబు కనడాల రక్షిత్ శెట్టి మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: