ఇక ఇటీవలే వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా రికార్డులను తిరగరాస్తుందనుకున్నారు కానీ అది మాత్రం జరగలేదు. అలాగే కన్నడ బాహుబలి గా పిలవబడే కేజిఎఫ్ చిత్రం కూడా బాహుబలి సినిమా రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. అయితే రాబోయే పాన్ ఇండియా చిత్రం పుష్ప -2 సినిమాకి ఈ అవకాశం ఉందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించడం జరుగుతోంది. పుష్ప మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఇక నార్త్ లో కూడా సరిగ్గా ప్రమోషన్ చేయ కుండానే పుష్ప చిత్రం 100 కోట్లకు పైగా వసూలు చేసి, అందరికీ షాక్ ఇచ్చింది. ఇక థియేట్రికల్ రిలీజ్ కంటే ఓటీటీ లో ఈ సినిమా మరింతగా ప్రేక్షకులకు దగ్గర అయిందని చెప్పవచ్చు. దీంతో పుష్ప పార్ట్ -2 పై న భారీ అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రెడీ అవుతున్నట్లుగా చిత్ర బృందం తెలియజేస్తూ ఉన్నది. మరి బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.