టాలీవుడ్ హీరో శివాజీ గురించి తెలిసిందే. మొదట సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసి అందరినీ మెప్పించి హీరో స్థాయికి ఎదిగాడు. కానీ హీరోగా ఎక్కువ కాలం నెట్టుకు రావడంలో విఫలం అయ్యాడు. తాను హీరోగా నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీనితో చాలా కాలం నుండి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చాడు. కానీ ఆ మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన దగ్గర నుండి పాలిటిక్స్ వైపు తన దృష్టిని మరల్చాడు. అయితే ముందుగా మాత్రం శివాజీ బీజేపీ లో చేరారు. కానీ అక్కడ కూడా యాక్టీవ్ గా అయితే లేడు. కానీ కొంతకాలం తర్వాత టీడీపీ కి సపోర్ట్ గా మాట్లాడం స్టార్ట్ చేశాడు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలి అని చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బీజేపీ ని ఉద్దేశించి చాలా కీలక వ్యాఖ్యలు చేసాడు. ఇక అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ని కూడా విమర్శించాడు. అలా మొన్నటి వరకు రాజకీయంగా ఏదో చేయాలని తాపత్రయపడ్డాడు. కానీ శివాజీ వల్ల ఏమీ కాదని తెలిసి చడీ చప్పుడు లేకుండా ఉండిపోయాడు. అయితే తాజాగా ఆయన సినిమా గురించి కామెంట్స్ చేశాడు. నేను కనుక ఇంతకాలం రాజకీయాల పేరుతో టైం వేస్ట్ చేయకపోయి ఉంటే... కోట్ల రూపాయలు సంపాదించేవాడినని కామెంట్ చేశాడు. త్వరలోనే సినిమాలకు మళ్ళీ వస్తాను అన్నట్లుగా ఈ మాటలను బట్టి అర్ధం అవుతోంది.

అయితే తన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం శివాజీ త్వరలోనే డైరెక్టర్ గా అవతారం ఎత్తనున్నాడట. ఇంతకు ముందు కూడా కొందరు హీరోలు డైరెక్టర్ లుగా వచ్చారు. దీనిపై ఇంకా శివాజీ అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు. మరి శివాజీ సక్సెస్ అవుతాడా లేదా అన్నది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: