ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు అంతా సలార్ చిత్రం పైనే ఆశలని పెట్టుకున్నారు. బాహుబలి సినిమాతో తరువాత ప్రభాస్సినిమా విడుదల చేసిన ఆ సినిమా ఫ్లాప్ గానే నిలుస్తూ వస్తోంది. దీంతో అభిమానులు సైతం చాలా నిరాశ చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టు గురించి ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అందులో కేజీఎఫ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమాని అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కావడంతో సలార్ సినిమా పైన భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఫిలిం సర్కిల్లో బాగా వైరల్ గా మారుతూనే ఉంటాయి.


తాజాగా ఇప్పుడు ఈ చిత్రం పైన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వైరల్ గా మారుతున్నది. ఇందులో ప్రభాస్ ఎంట్రీ సీన్ సినీ చరిత్రలోనే చాలా కొత్తగా వినూత్నంగా ఉంటుంది అని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ ఎంట్రీ భారీ లోయలో ప్లాన్ చేసినట్లుగా డైరెక్టర్ తెలియజేయడం జరిగింది. ఇక అందులో అండర్ గ్రౌండ్ విజువల్స్ మరింత అద్భుతంగా ఉంటాయని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక అండర్ గ్రౌండ్ లోపల ప్రభాస్ చేసి యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని టాక్.


దీంతో సలార్ సినిమా  పైన ప్రభాస్ ఆభిమానులకు ఫుల్ మీల్స్ ఇవ్వడానికి డైరెక్టర్ ప్రశాంతనిల్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ క్లైమాక్స్ లోని ఒక యాక్షన్ సీన్ కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని హంబెలే ఫిలిం నిర్మిస్తున్నది ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ ఆధ్యా పాత్రలో నటిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతున్నది. ఇక ఈ సినిమా కోసం ఎంతోమంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: