టాలీవుడ్ లో సినిమా సినిమాకు కొత్తదనం చూపిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన యంగ్ హీరోలలో రామ్ పోతినేని ఒకరు. రామ్ తన మొదటి సినిమా తోనే ఎనర్జీ రేంజ్ ఏమిటో అందరికీ రుచి చూపించాడు. అందుకే ఇతన్ని ఫ్యాన్స్ అందరూ ఎనర్జిటిక్ స్టార్ గా పిలుచుకుంటూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు తన క్రేజ్ టాలీవుడ్ కే పరిచయము అయి ఉండేది. కానీ తన తాజా చిత్రంతో ఇప్పుడు రెండు భాషలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఎప్పుడూ టాలీవుడ్ దర్శకులను నమ్ముకున్న రామ్ ఈ సారి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించి తమిళ డైరెక్టర్ లింగుస్వామి తో జత కట్టాడు. ఇష్మార్ట్ శంకర్ లాంటి మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత... రెడ్ తో ప్రేక్షకులను నిరాశపరిచాడు.

అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో వరుస విజయాలు చాలా కీలకం అని చెప్పాలి. అందుకే రామ్ మరో మాస్ కంటెంట్ ను ఎంచుకుని గ్రాండ్ గా రేపు తెలుగు మరియు తమిళ రాష్ట్రాలలో రిలీజ్ కానున్నాడు. ఈ సినిమాలో రామ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇందులో రామ్ కు జోడీగా హిట్ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది. ఇప్పటి వరకు సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు మరియు ట్రెయిలర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి.

అయితే రేపు రిలీజ్ అవనున్న నేపథ్యంలో వేరే సినిమాలు ఏవీ పోటీ లేకపోవడంతో మంచి ఓపెనింగ్స్ ను సాధిస్తుంది అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఎంతవరకు ఇది ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది అన్నది చూడాలి. అయితే సోషల్ మీడియాలో వచ్చే రివ్యూలని బట్టి సినిమా టాక్ అనేది ఉండనుంది. అయితే రామ్ పెద్ద హీరో కాదు కాబట్టి ఇలాంటి సమస్య ఉండబోదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: