తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ పూజ హెగ్డే ప్రస్తుతం ఎక్కువగా ప్రపంచాన్ని చుట్టేసే పనిలో ఉన్నది. కొద్దిరోజుల నుండి బిజీ షెడ్యూల్ కారణంగా విసిగిపోయి తాజాగా వేకేషన్ కు చేరుకుంది. మూడు ఖండాలు నాలుగు నగరాలు అంటు ఒక మాసం పాటు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఉండే ఒక ఫోటోని సైతం సోషల్ మీడియాలో పంచుకుంది. నెలరోజుల పాటు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళబోతున్నట్లుగా ఈ ఫోటోని షేర్ చేసింది పూజ హెగ్డే.
ఇక పూజ హెగ్డే కెరియర్ విషయానికి వస్తే బ్రేకులు లేని హిట్లర్లా దూసుకుపోతున్న తరుణంలో రాదేశ్యామ్ చిత్రంతో ఒక్కసారిగా ఇమే కెరీర్ కు బ్రేక్ పడింది దాని నుంచి బయటపడకుండానే బీస్ట్ ఆచార్య సినిమాతో మరొక డిజాస్టర్ లను అందుకుంది అయినప్పటికీ ఈమె క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా వరుస అవకాశాలను అందుకుంటోంది. ఇదంతా బాగానే ఉన్నా కోలీవుడ్ లో మాత్రం ఏమి కెరియర్ అనుకున్నంత స్థాయిలో ఎదగలేదని చెప్పవచ్చు. మొదట తమిళ చిత్రమైన మాస్క్ తో సినీ రంగంలో ప్రవేశించింది ఈ ముద్దుగుమ్మ ఇక 2012లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.
ఇక ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ఇమే టాలీవుడ్ వైపు అడుగులు వేసింది దాదాపుగా పదేళ్ల తర్వాత ఇటీవల బీస్ట్ సినిమాతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అయినా కూడా ఈ చిత్రంతో ఆకట్టుకోలేక పోయింది. ఇక గతంలో హీరోయిన్ ఇలియానా కూడా ఇలాగే జరిగింది 2006లో దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చింది. కేడి చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగు పెట్టింది అక్కడ ఆ చిత్రం ఫ్లాప్ గా అనిపించింది దాంతో అక్కడ ఆమెను ఎవరు పట్టించుకోలేదు. టాలీవుడ్ లో మాత్రం ఇలియానా స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. దాంతో ఇలియానా ఇక కోలీవుడ్లో కనిపించలేదు. ఇక పూజ హెగ్డే కూడా ఇలాగే జరిగింది. దీంతో ఈమె కూడా కోలీవుడ్లో కనిపించదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.