గత రెండేళ్ల క్రితం కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ మూగ బోయింది.. సినిమా షూటింగ్ లు, సినిమా విడుదల ఎక్కడిక్కడ ఆగిపోయాయి.కొద్దిగా కరోనా కేసులు తగ్గిన తర్వాత షూటింగ్ లు, సినిమాలు వరుస పెట్టి విడుదల అయ్యాయి.అయితే గత ఏడాది సమ్మర్ ను హీరోలు టార్గెట్ చేసారు.. చిన్నా, పెద్ద అన్నీ సినిమాలు కూడా సమ్మర్ లో వరుస పెట్టి విడుదల అయ్యాయి.ఇలా సమ్మర్ అయిపోయి వర్షాలు మొదలయ్యాయి లేదో టాలీవుడ్ అప్పుడే వచ్చే సమ్మర్ ని టార్గెట్ చేసేసింది. ఒకరిద్దరు కాదు వరసగా టాలీవుడ్ లోఉన్న స్టార్ హీరోలందరూ వేసవి బరిలోకే దిగడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్, మహేష్, చిరంజీవి.. ఇలా స్టార్ హీరోలంతా సమ్మర్ హీట్ ని పెంచడానికి రెడీ అవుతున్నారు.


ఈ సంవత్సరం సమ్మర్ లో పోటా పోటీగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందుకే సినిమాలకు బెస్ట్ సీజన్ అయిన సమ్మర్ నే టార్గెట్ చేసుకున్నారు స్టార్ హీరోలు. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా వరస పెట్టి సమ్మర్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో దాదాపు ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమా రామ్ చరణ్ దే. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2023 ఎర్లీ సమ్మర్ మార్చిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. అనుకున్న టైమ్ కన్నా సినిమా ముందే రెడీ అవుతుండడంతో మిడ్ సమ్మర్ మూవీ కాస్తా మార్చికే ప్రీ పోన్ అయ్యేలా ఉంది..


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ సలార్ కూడా సమ్మర్ కే రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఇప్పటికే 60 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రశాంత్ నీల్ ఏప్రిల్ లో సినిమా రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసుకనే పనిలో ఉన్నారు. మహేష్ బాబు కూడా తన సమ్మర్ సెంటిమెంట్ ని రిపీట్ చేద్దామనే చూస్తున్నారు. ఇటీవల సమ్మర్ లో సర్కారు వారి పాట సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు..దసరాకి గాడ్ ఫాదర్, సంక్రాంతికి వాల్తేరు వీరయ్యని అనౌన్స్ చేసిన మెగాస్టార్ సమ్మర్ కి మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న మాస్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ భోళాశంకర్ సినిమాని సమ్మర్ కే రిలీజ్ చేయాలని చేస్తున్నారు చిరు. సౌత్ లోనే కాకుండా ఇండియా మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్న పుష్ప 2 మూవీ సమ్మర్ నే టార్గెట్ చేసుకుంది.రామారావ్ ఆన్ డ్యూటీ , దసరాకి రావణాసుర సినిమాల్ని ప్లాన్ చేశాడు. నక్కిన త్రినాధ్ రావ్ డైరెక్షన్లో మాస్ మహారాజా చేస్తున్న ధమాకా సినిమాని 2023 సమ్మర్ లోనే రిలీజ్ కి ప్లాన్ చేయబోతున్నారు..ఇలా స్టార్ హీరోలు అందరు వచ్చే సమ్మర్ ను టార్గెట్ చేశారు..


మరింత సమాచారం తెలుసుకోండి: