నందమూరి నట సింహం బాలయ్య బాబు ఇటీవల వచ్చిన అఖండ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత కాస్త దూకుడును పెంచారు. చేతిలో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు.నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది..బాలయ్య మాస్ యాక్షన్ డోస్ ను ఇంకాస్త చిత్ర యూనిట్ పెంచారు.


ఈ సినిమాలో బాలయ్య ఊరమాస్ లుక్‌తో కనిపిస్తుండంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ముగించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోండగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు బాలయ్య సిద్ధమవుతున్నాడు..అనిల్ రావిపూడి ఇప్పటికే స్క్రిప్టును రెడీ చేసి ఉంచగా, ఈ సినిమాలో బాలయ్య తండ్రి పాత్రలో నటిస్తాడని, ఆయనకు కూతురిగా శ్రీలీలా కనిపిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాలో బాలయ్య లుక్‌ను పూర్తిగా మార్చే ప్లాన్‌లో ఉన్నాడట అనిల్ రావిపూడి. దీంతో ఈ సినిమాకు వైవిధ్యమైన టైటిల్‌ను పెట్టే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది.


ఈ చిత్రం కోసం ఇప్పటికే 'బ్రో.. ఐ డోంట్ కేర్' అనే స్టైలిష్ టైటిల్‌ను ఫిక్స్ చేయాలని బాలయ్య చూస్తున్నట్లుగా తెలుస్తోంది..నందమూరి అభిమానులకు నచ్చినా కూడా, బాలయ్య మాత్రం ఈ టైటిల్ తనకు సెట్ కాదని భావిస్తున్నాడట. దీంతో ఈ సినిమాకు వేరే టైటిల్ పెట్టాల్సిందేనని.. తనకు నచ్చని టైటిల్‌తో రాజీ పడే సమస్యే లేదని బాలయ్య 'ఐ డోంట్ కేర్' అంటూ చిత్ర యూనిట్‌కు తేల్చి చెప్పేశాడట. దీంతో ఇప్పుడు బాలయ్య సినిమా కోసం వేరొక టైటిల్‌ను వెతికే పనిలో పడ్డాడు డైరెక్టర్..మరి టైటిల్ ను అనిల్ ఎలా లాక్ చేస్తారో తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: