తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత పేరుకు పెద్దగా పరిచయం లేదు.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే టాలీవుడ్‌ లో శాంకుతలం, యశోద చిత్రాల తో బిజీగా ఉన్న సమంత ఈ రెండు సినిమాల ను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తోంది.. ఇక ఈ సినిమాల తో పాటు పలు క్రేజీ ప్రాజెక్టుల ను ఆమె పరిశీలిస్తోంది. అయితే కేవలం టాలీవుడ్‌ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లోనూ సామ్ తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.


కాగా, ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌ తో బాలీవుడ్ జనాల ను మెప్పించిన ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తోంది. పలువురు దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో నటించాల్సింది గా కోరుతుండ గా, సమంత ఆయా ప్రాజెక్టుల కు సంబంధించిన కథల ను వింటున్నట్లు గా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ బ్యూటీ కేవలం బాలీవుడ్‌ లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ ఎంట్రీకి రెడీ అయ్యింది..


హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ జాన్ గతం లోనే సమంత ను 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే సినిమా లో నటించాల్సింది గా కోరగా, ఆమె ఈ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తాని కి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనే తేడా లేకుండా సమంత అన్ని ఏరియా లను కవర్ చేయాలని చూస్తోంది. అన్నీ ఏరియా లలో అమ్మడు కు దూకుడు ఎక్కువ అయ్యింది.. మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఎక్కడ చూసిన బాగా ఫాలోయింగ్ పెరిగింది.. ఐటమ్ సాంగ్ లలో కూడా మెరిసింది.. అది కూడా మంచి టాక్ ను అందించింది. మరి ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో దక్కిన స్టార్ ఇమేజ్ మిగతా ఇండస్ట్రీల్లో దక్కుతుందో లేదో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: