సోనూసూద్ అంటే ఇప్పుడు ఒక దేవుడు కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందరికో పునర్జన్మను ఇచ్చాడు. అందుకే ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు. ఏ సమయంలో సాయం కావాలని అడిగిన కూడా లేదనకుండా ఇచ్చేవాడు. ఆయన సాయం పొందిన వారు ఎందరో ఆయనను కలిసి థాంక్స్ చెబుతున్నారు.తాజాగా మరో వ్యక్తి కూడా హీరోను కలిసి థ్యాంక్స్ చెప్పాడు.

సోనూ సూద్ కారణంగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన చాలా మంది ముంబైకి వెళ్లి మరీ ఆయన్ను కలిసి కృతజ్ఞతలు చెప్పి వస్తుంటారు. తాజాగా తెలంగాణ కు చెందిన రామ్ ప్రసాద్ భండారి అనే యువకుడు సైతం బైక్ మీద ముంబై వెళ్లి మరీ సోనూసూద్‌ను కలిసి వచ్చారు. ఈ విషయాన్ని సోనూ సూద్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.రామ్ ప్రసాద్ కొద్ది రోజుల క్రితం ‘కోమా’లోకి వెళ్లారు.

డాక్టర్లు సైతం ఆశలు వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ టీమ్ అతడి చికిత్స కోసం సాయం చేసింది. సోనూసూద్ సాయమో లేదంటే.. దేవుడి దీవెనల ఫలితమో తెలీదు గానీ.. రామ్ ప్రసాద్ అనూహ్యంగా కోలుకున్నారు. కోమా నుంచి బయటపడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషించారు.సోనూసూద్ చేసిన సాయం గురించి తెలియడంతో.. ఆయన్ను కలవాలని తపించాడు. అనుకున్నదే తడవుగా.. బైక్ ముందు జాతీయ జెండా.. వెనుక జై సోనూసూద్ అనే మరో జెండాతో.. సోనూసూద్ ఫొటో ఉన్న టీషర్ట్ ధరించి.. తన కూతుర్ని తీసుకుని తెలంగాణ నుంచి ర్యాలీగా ముంబై వెళ్లారు.

కొద్ది రోజుల ప్రయాణం తర్వాత రామ్ ప్రసాద్ ముంబైకి చేరుకొని సోనూసూద్‌ను కలిశాడు. అతడి గురించి తెలుసుకున్న సోనూ.. ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తనకు ధన్యవాదాలు తెలపడానికి తెలంగాణ నుంచి వచ్చిన వారితో ఆత్మీయంగా మాట్లాడిన ఆయన.. వారితో దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. రామ్ ప్రసాద్ ఆరోగ్యంగా ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సోనూ.. ఇలాంటి క్షణాలే.. ఎంత కష్టమైనా మంచి పనులు చేయడానికి మోటివేషన్ ఇస్తాయన్నారు. ఆ చిన్నారి కళ్లలోని ఆనందాన్ని వెలకట్టలేమంటూ సోనూసూద్ సంతోషం వ్యక్తం చేశారు.ఇది కాస్త నెట్టింట చుసిక్ఖసీలు కొడుతుంది..


 

మరింత సమాచారం తెలుసుకోండి: