విశ్వ నటుడు కమల్ హాసన్ 'విశ్వరూపం 2' సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఇక విక్రమ్ మూవీ తో వెండి తెరపై ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.లోక నాయకుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా కావడం ఇంకా అలాగే వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న లోకేష్ కనకరాజు విక్రమ్ మూవీ కి దర్శకత్వం వహించడం ఇంకా అలాగే విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్ , సూర్య లాంటి స్టార్ నటులు విక్రమ్ మూవీ లో నటించడంతో ఈ మూవీ పై మొదటి నుండే పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు అనేవి చాలా ఎక్కువగా ఏర్పడ్డాయి.ఇక ఆ అంచనాలకు తగినట్లు గానే విక్రమ్ సినిమా గత నెల అనగా జూన్ 3 వ తేదీన భారీ అంచనాలతో విడుదల అయ్యింది. విక్రమ్ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇంకా అలాగే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ లు కూడా అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి.


ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.80 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయగా ఇంకా 31.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి  బ్లాక్ బస్టర్ హిట్ విజయాన్ని అందుకుంది.ఇంకా అలాగే ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన విక్రమ్, ఫ్రాన్స్ లో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి అక్కడ టాప్ పొజిషన్లో నిలిచింది.సుమారు 6 కోట్లు దాకా వసూళ్లు రాబట్టి ఇండియన్ సినిమాల్లో టాప్ గా నిలిచింది.ఇది ఇలా ఉంటే విక్రమ్ సినిమా కొన్ని రోజుల నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థియేటర్ లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న విక్రమ్ సినిమా ప్రస్తుతం ఓ టి టి ప్లాట్ ఫామ్ లో కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: