అంతర్జాతీయ పత్రిక ‘టైమ్’ ఒక ప్రముఖ వ్యక్తి ఫోటోను కవర్ పేజ్ పై ముద్రించి ఆవ్యక్తి పై ఒక కథనం ప్రచురిస్తే అంతర్జాతీయంగా అదొక న్యూస్. అదేవిధంగా మన ఇండియాలో ‘ఇండియా టుడే’ ఒక వ్యక్తి ఫోటోను కవర్ పేజ్ పై ప్రచురించి అతడి గురించి ఒక ఆసక్తికర కథనం ప్రచురిస్తే అది దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారుతుంది.


గతంలో ఇండియా టుడే చిరంజీవి మహేష్ ల ఫోటోలను తమ పత్రిక ముఖచిత్రాలుగా ప్రచురించినప్పుడు అప్పట్లో చిరంజీవి మహేష్ అభిమానులు చేసిన హడావిడి అంతాయింతా కాదు. 2018 ప్రాంతంలో ‘బాహుబలి’ మ్యానియా దేశాన్ని షేక్ చేస్తున్నప్పుడు ఇండియా టుడే ప్రభాస్ పై ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించడమే కాకుండా ప్రభాస్ ను బాహుబలి గా చూపెడుతూ కవర్ పేజీ పై ప్రింట్ చేసింది.


ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. ‘పుష్ప’ తరువాత బన్నీ మ్యానియా విపరీతంగా పెరిగి పోవడంతో అల్లు అర్జున్ ముఖ చిత్రాన్ని ఇండియా టుడే పై ప్రచురించడంతో బన్నీ అభిమానులు తెగ హడావిడి చేస్తూ ప్రభాస్ అభిమానులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రగడ సృష్టిస్తున్నారు. అంతేకాదు బన్నీ మాత్రమే అసలైన రియల్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అంటూ అతడి అభిమానుల హడావిడి తారా స్థాయిలో నడుస్తోంది.


దీనికి ధీటుగా ప్రభాస్ ఫ్యాన్స్ బదులు ఇస్తూ తమ ప్రభాస్ కు ఇండియా టుడే లో ఇలాంటి గౌరవాలు ఎప్పుడో దక్కాయని తమ హీరో 100 కోట్ల పారితోషికం రేంజ్ లో ఉన్నాడని అలాంటి స్థాయి బన్నీ కి ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ‘బాహుబలి’ కి 17వందల కోట్లు కలక్షన్స్ వస్తే ‘పుష్ప’ కు వచ్చింది 3వందల కోట్లు మాత్రమే కదా అంటూ బన్నీ అభిమానులు తెగ రెచ్చకొడుతున్నారు. ఇప్పుడు ఈ మాటల వార్ సోషల్ మీడియాలో హైలెట్ గా కొనసాగుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: