టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో హిందీలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా హిందీలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది...


బాలీవుడ్ సినిమాలు థియేటర్లలో సక్సెస్ కావడంలో ఫెయిల్ అవుతున్న తరుణంలో మంచి కంటెంట్ తో తెరకెక్కిన పుష్ప ది రైజ్ బాలీవుడ్ ప్రేక్షకుల అందరి మెప్పు పొందింది. రాజమౌళి సపోర్ట్ లేకుండానే బాలీవుడ్ లో విజయాన్ని సొంతం చేసుకున్న హీరోలలో బన్నీ ఒకరిగా నిలిచారు.


అయితే సౌత్ సినిమాలు హిందీలో హిట్ కావడం గురించి తాజాగా బన్నీ ఆసక్తికర విషయాలను వెల్లడించారట.. సౌత్ సినిమాలలో హీరోయిజం, పాటలు, ఫైట్లు హీరోను ఎలివేట్ చేసే సన్నివేశాలు బాగుంటాయని బన్నీ చెప్పుకొచ్చారట.. ప్రస్తుతం వాటిని హిందీ ఆడియన్స్ సైతం ఆదరిస్తున్నారని బన్నీ కామెంట్లు చేశారు. సౌత్ ప్రేక్షకులు అలాంటి సినిమాలను చూడటానికి అలవాటు పడ్డారని రెగ్యులర్ గా ఇవే తరహా కథలను ఇక్కడి ఫిల్మ్ మేకర్స్ ఎంపిక చేసుకుంటున్నారని బన్నీ చెప్పుకొచ్చారట..


 


ఈ కారణాల వల్లే సౌత్ సినిమాలను హిందీ ఆడియన్స్ ఆదరిస్తున్నారని బన్నీ అభిప్రాయపడ్డారు.మరోవైపు పుష్ప2 మూవీ షూటింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఏడాదే పుష్ప2 మూవీ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. పుష్ప1 అంచనాలకు మించి సక్సెస్ సాధించగా పుష్ప2 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.


 


300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీ ప్రేక్షకులకు బన్నీ దగ్గర కాగా పుష్ప ది రైజ్ సక్సెస్ తో బాలీవుడ్ హీరోలకు బన్నీ గట్టి పోటీ ఇస్తున్నారట.. సినిమాసినిమాకు బన్నీకి క్రేజ్ పెరుగుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: