టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ కనీవిని ఎరుగని స్లంప్ ఎదుర్కుంటోంది. హిట్ అన్నపదం విని ఇండస్ట్రీలో రెండు నెలలు కావస్తోంది. దిల్ రాజ్ లాంటి భారీ నిర్మాత భారీ డిస్ట్రిబ్యూటర్ కూడ కొనసాగుతున్న ఈ స్లంప్ పై ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నాడు. అసలు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూస్తారు అన్న విషయం తలలు పండిన ఇండస్ట్రీ ప్రముఖులకు కూడ అర్థం కావడం లేదు.


టిక్కెట్ల రెట్లు తగ్గించినా జనం రావడం లేదు ఓటీటీ లో వస్తున్న వెబ్ సిరీస్ పర భాషా సినిమాలు ఇలా అన్నీ వరసపెట్టి చూస్తూ ప్రేక్షకులు ధియేటర్లకు రావడానికి మార్గాలు మర్చిపోతున్నారు. పబ్ లు హోటల్స్ నగల దుకాణాలు ఇలా ఎక్కడ చూసినా జనం కనిపిస్తుంటే సినిమాలు చూడటానికి మాత్రం జనం ఎందుకు రావడం లేదో అర్థంకాని విషయంగా మారింది.


ఇలాంటి పరిస్థితులలో ఈవారం విడుదల కాబోతున్న రవితేజా ‘రామారావు ఆన్ డ్యూటీ పై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. రవితేజా పక్కా మాస్ హీరో అయినప్పటికీ ఆమధ్య అతడు నటించిన ‘ఖిలాడి’ ఫ్లాప్ అయింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీలో నటించడానికి రవితేజా 18 కోట్లు తీసుకున్నాడు అన్న ప్రహారం జరుగుతోంది. దీనితో ఈమూవీ నిర్మాణ ఖర్చు 30 కోట్లు దాటింది అని అంటున్నారు. ఇప్పుడు ఈమూవీ హిట్ అనిపించుకోవాలి అంటే 40 కోట్ల నెట్ కలక్షన్స్ వచ్చి తీరాలి.


అయితే టాప్ యంగ్ హీరోల సినిమాలు కూడ కేవలం విడుదలైన మూడు రోజులు పాజిటివ్ టాక్ వస్తే ధియేటర్లు నిండి ఆతరువాత వచ్చే మొదటి సోమవారం నుండి ధియేటర్లు ఖాళీ అవుతున్నాయి. దీనితో ఓటీటీ సినిమాలకు అలవాటు పడిపోయిన ప్రేక్షకులను మాస్ మహారాజా తన మ్యానియాతో ధియేటర్లకు రప్పించగలడా అన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. అదే జరిగితే రవితేజా పేరు మారుమ్రోగి పోయి ఈమూవీ హిట్ మాస్ మహారాజ పారితోషికం 20 కోట్లు దాటిపోయే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: