రవితేజ నటించిన తాజా చిత్రం.. రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాని డైరెక్టర్ శరత్ మండువ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా నుంచి టీజర్ ,ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించాయి. ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈ సినిమా నుండి మాస్ నోటీస్ అనే పేరుతో ఒక ట్రైలర్ను విడుదల చేశారు.


మాస్ యాక్షన్ తో కూడిన ఈ సినిమా రామారావు మాస్ నోటీస్ రవితేజ ఫాన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో రవితేజ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు ధర్మాన్ని కాపాడడానికి తనలోని మరొక కోణాన్ని బయట పెట్టబోతున్నట్లు ఈ సినిమా టీజర్ చూస్తే తెలుస్తోంది. సాధారణంగా మిస్సింగ్ కేసులను పోలీసులు చేదించడం జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ రామారావు అని ఒక సివిల్ ఆఫీసర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ కేసును చేదించాడా లేదా అన్న విషయమే ఈ సినిమా స్టోరీగా ఉన్నట్లు.


అలాంటి సమయంలోనే ఎలాంటి సవాళ్లను రామారావు ఎదుర్కొన్నాడు తమ కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో అన్న విషయం తెలియాలి అంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.. ఇక రవితేజ చెప్పే డైలాగులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరొక హీరో వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక నాజర్ సీనియర్ నరేష్, పవిత్రలోకేష్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రలలో కనిపించబోతున్నారు. రవితేజసినిమా కి నిర్మాతగా కూడా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా విజయ మండుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: