దేశం మొత్తం కోవిడ్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్న వేళ నేషనల్ వైడ్ వినిపించిన ఒకే ఒక్క పేరు సోను సూద్. ఎంతోమంది ప్రముఖులు  చేయలేని పనిని తాను ముందుకు వచ్చి తన వంతు సహాయంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టారు. ఇక అనుకోకుండా లాక్ డౌన్ విధించడంతో దూరమైన ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి అండగా నిలిచి తన బస్సులో, ట్రైన్లో చివరికి ప్రత్యేకమైన ఫ్లైట్లో కూడా తన సొంత ఖర్చులతో వారిని తమ గమ్యానికి చేర్చి బాగా పాపులర్ అయ్యారు.. దీంతో రియల్ హీరో అని కూడా పేరు వచ్చేలా చేసుకున్నారు హీరో సోనుసూద్.


ఇన్నేళ్ల తన కెరీర్లు ఎన్నో సినిమాలలో  హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంటూ ఉన్నారు. నాగపూర్ లో యశ్వంతరావు చౌహాన్ అని ఇంజనీరింగ్ కాలేజీలో తన చదువును పూర్తి చేసి ఉన్నారు. ఇక ఈయన తండ్రి కూడా ఒక షాప్ కీపర్. సోనుసూద్ ఆయన చదువుని పూర్తి చేసుకొని 1996లో ముంబైలో అడుగు పెట్టారు. అయితే తన కోరిక మాత్రం నటుడు కావాలని చాలా బలంగా ఉండేదట అయితే ఆ కోరిక మేరకు ముందు మోడల్గా రాణిస్తే నటుడుగా అవకాశాలు అందుకోవచ్చని ఆ వైపుగా అడుగులు వేశారు.


పలు అడ్వర్టైజ్మెంట్లకు వెళ్లడం వారు రిజెక్ట్ చేయడం ఇలా జరుగుతూ ఉండేవట కానీ సోనుసూద్ ముంబైలో ఎదుర్కొన్న అనుభవాలలో విచిత్రం ఏమిటంటే.. తన కెరియర్ గాడిలో పడక ముందే వివాహం చేసుకున్నారు ఇక అక్కడి నుంచి తన కష్టాలు ఎక్కువగా మొదలయ్యాయి. తను ఎక్కడ ప్రయత్నించినా కూడా అందంగా లేవని రిజెక్ట్ చేసేవాడట. అలా ప్రయత్నాలు చేసిన తర్వాత 3 ఏళ్లకు సౌత్ లో తొలి అవకాశం అందించారు. తను నటించిన మొదటి తమిళ సినిమా`కల్లాజ్గర్ ... ఈ సినిమాల విజయ్ కాంత్ హీరోగా లైలా హీరోయిన్ గా నటించినది. ఇక ఆ తర్వాత జయసుధ నటించిన హ్యాండ్సప్ సినిమాలో మొదటి అవకాశం దక్కించుకున్నాడు. ఇక భగత్ సింగ్ అనే సినిమాలో హీరోగా నటించిన అంతగా ఆకట్టుకోలేకపోయాడు దీంతో పలు సినిమాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాని సెట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: