ఆచార్య
సినిమా తరువాత
కొరటాల శివ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని చెప్పాలి. మొన్నటికి మొన్న కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు
కొరటాల శివ ఆఫీసు వద్దకు వచ్చి
రచ్చ రచ్చ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ
సినిమా యొక్క ఫ్లాప్ ప్రభావం కేవలం
కొరటాల శివ పైన మాత్రమే పడడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తుంది. ఈ చిత్రంలో హీరోలుగా నటించిన
మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఈ విషయాన్ని ఎంతవరకు పట్టించుకుంటున్నారో తెలియదు కానీ బయటకు మాత్రం కేవలం
కొరటాల శివ పైన ఎక్కువగా భారం పడుతుంది అన్న వార్తలు వస్తున్నాయి.
ఆ విధంగా
కొరటాల శివ దర్శకత్వం తో పాటు ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామి కావడం అతి పెద్ద మైనస్ అయిందని చెప్పాలి. తొందరలోనే ఆయన దీని నుంచి పూర్తిగా కోలుకోవాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను తొందరలోనే మొదలుపెడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి కానీ ఎప్పుడు మొదలు పెడుతున్నారు అన్న క్లారిటీ మాత్రం ఇప్పటిదాకా రాలేదు. దాంతో
ఎన్టీఆర్ అభిమానులు ఒకవైపు కోపాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఎప్పుడు
ఎన్టీఆర్ ఈ సినిమాను మొదలుపెడతారు అన్న నిరాశను కూడా వారు వ్యక్తపరుస్తున్నారు. ఆ విధంగా
కొరటాల శివ ఈ
సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం నెలల తరబడి సమయం తీసుకోవడం అందరిని అసహన పరుస్తుంది.
జూన్ లో మొదలవుతుందన్న ఈ
సినిమా జూలై పూర్తయినా కూడా మొదలు పెట్టకపోవడం ఎప్పుడు మొదలుపెడతామనే హింట్ ఇవ్వకపోవడం కూడా అందరిని ఎంతగానో నిరాశ పరుస్తుందని చెప్పాలి. మరి భారీ స్థాయిలో హిట్ ట్రాక్ ఉన్న
కొరటాల శివ ఈ చిత్రాన్ని మొదలు పెట్టడానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇకపోతే
జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ అనే
సినిమా చేసిన
కొరటాల శివ ఇప్పుడు చేస్తున్న ఈ రెండవ సినిమాను అంతకు మించిన విజయాన్ని అందేలా చేసుకోవాలని ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆయన తొందరగా ఈ చిత్రాన్ని మొదలుపెడితే మంచిది.