సమంత బాలీవుడ్ డైరెక్టర్ నిర్మాత కరణ్ టాక్ షోలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే పెళ్లి విడాకుల గురించి కూడా ఆసక్తికరమైన విషయాల ను అయితే వెల్లడించారు.

ఈ నేపథ్యంలో సమంత పై కోపం తో నాగచైతన్య సమంత జ్ఞాపకాలన్నింటిని చెరిపేసినట్టు తెలుస్తుంది. సమంత తో నాగచైతన్య కలిసి దిగినటువంటి ప్రైవేట్ ఫోటోల ను కూడా చింపేశారని సమాచారం. ఇదే కాకుండా సమంత నాగచైతన్య కలిసి నటించి న మొట్టమొదటి చిత్రం ఏం మాయ చేసావే సినిమా నుంచి వారిద్దరు కలిసి నటించిన సినిమాల అగ్రిమెంట్ల ను కూడా నాగచైతన్య చింపేశారని తెలుస్తోంది.


సమంత నాగచైతన్య ఇద్దరు విడిపోవడంతో నాగచైతన్య కూడా లోలోపల ఎంతో బాధపడుతున్నారని సమాచారం. మొత్తానికి సమంత నాగచైతన్య ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి వైవాహిక జీవితం మాత్రం ఎక్కువ కాలం నిలవలేదని చెప్పాలి. ప్రస్తుతం వీరిద్దరూ తమ సినిమా పనులతో ఎంతో బిజీగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.


ఇకపోతే.. చైతన్య సమంతతో మళ్లీ కలిస్తారా నటిస్తారా అనే ప్రశ్నకు వాళ్లిద్దరూ కలిసి నటించే అవకాశమే లేదని చాలామంది కూడా భావిస్తున్నారు. నాగచైతన్యకు తాజాగా ఇదే ప్రశ్న ఎదురుకాగా చైతన్య ఆ ప్రశ్నకు స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను సమంత మళ్లీ కలిసి నటిస్తే క్రేజీగా ఉంటుందని కూడా చైతన్య అన్నారు.


అయితే నేను సమంత కలిసి నటించడం జరుగుతుందో లేదో నేను అయితే చెప్పలేనని చైతన్య వెల్లడించారు. ఈ ప్రపంచానికే తెలియాలని భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామంటూ నాగచైతన్య కామెంట్లు కూడా చేశారు.మరి చూడాలి సమంత నాగ చైతన్య తిరిగి ఎప్పటిలాగే కలిసి ఉండాలని కలిసి సినిమాల లో నటించాలని అనుకునే వారి కోరిక తీరుతుందో లేదో మరి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: