సమంత నాగచైతన్యలు విడిపోయినప్పటికీ వారు వారి సినిమాలకు సంబంధించి విడివిడిగా ఇచ్చే ఇంటర్వ్యూలలో వారి విడాకులకు సంబంధించిన ప్రశ్నలు వారిని వెంటాడడం ఒక అలవాటుగా మారిపోయింది. ఈమధ్య కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న టాక్ షోలో సమంత ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తామిద్దరం కలిసి ఒక రూమ్ లో ఉండవలసిన పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడితే తమ వద్ద చాల పదునైన వస్తువులు ఉండాలి అంటూ జోక్ చేసింది.


ఇప్పుడు ఈవిషయమై నాగచైతన్య వంతు వచ్చింది. ఈనెల రెండవ వారంలో విడుదల కాబోతున్న బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీని ప్రమోట్ చేస్తూ నాగచైతన్య సమంత విషయమై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. భవిష్యత్ లో చైతన్య సమంత తో కలిసి నటిస్తాడా అన్న ప్రశ్నకు చైతూ చాల తెలివిగా సమాధానం ఇచ్చాడు.


'ఒకవేళ అలా జరిగితే చాలా క్రేజీగా ఉంటుందేమో తనకు తెలియదు కానీ రేపు ఏమి జరుగుతుందో తనకు తెలియదు అని అంటూ ఈవిషయమై తాను ఎక్కువగా ఆలోచించను అంటూ కామెంట్ చేసాడు. చైతూ కూల్ గా ఇచ్చిన ఇలాంటి సమాధానంతో భవిష్యత్ లో చైతన్య సమంత లు తిరిగి నటిస్తారా అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఈమధ్య సమంత చైతన్యతో విడిపోయిన తరువాత తామిద్దరూ కలిసి ఉన్న ఒక విల్లాను సమంత ఎక్కువ ధర పెట్టి కొన్నది అని వస్తున్న వార్తలు విన్నవారు వీరిద్దరూ విడిపోయినా ఇప్పటికీ వీరికి ఒకరి పై ఒకరికి అభిమానం ఇప్పటికీ ఉందా అన్న సందేహాలు రావడం సహజం.


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే సమంతా చైతన్యలు ‘మజిలీ’ లాంటి ఒక మంచి సినిమాలో మళ్ళీ కలిసి నటిస్తే బాగుంటుంది అంటూ వీరిద్దరికీ సోషల్ మీడియాలో కొంతమంది సూచనలు కూడ చేస్తున్నారు. లేటెస్ట్ గా చైతన్య నటించిన ‘థాంక్యూ’ ఫెయిల్ అవ్వడంతో ఈ నెలలో రాబోతున్న ‘లాల్ సింగ్ చద్దా’ చైతూ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: