రాజీవ్ కనకాల ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత సుమ.. తన ఫోకస్ మొత్తం బుల్లితెర పైన పెట్టింది. ఇక దాంతో వెండితెరకు దూరంగా ఉండిపోయింది అయితే సుమ పెళ్లి 1999లో జరిగింది. ఆ పెళ్లి ముచ్చట్లు ఇప్పుడు తాజాగా బయటకు తీసుకురావడం జరిగింది. అలా బయటికి రావడానికి పలు కారణాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు తాజాగా యాంకర్ సుమ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది అందులో.. తన వరలక్ష్మీ వ్రతం చీర తన తల్లికి 80వ బర్తడే సందర్భంగా ఒక చీరను తీసిస్తూ ఒక వీడియోని విడుదల చేసింది.
ఇక వీడియోలోని సుమ షింఘానియా అనే ఒక షాపింగ్ మాల్ యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను తెలియజేసింది అందులో ఎన్నో లక్షల ఖరీదు ఉన్న చీరలు కూడా వివరించింది. ఇక అందులో 15 వేల రేంజ్ లో ఒక చీరను చూపించమని సరదాగా సుమ అన్నది మీరేం ఇది కాదు మేడం అంటూ సేల్స్ మాన్ ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళమని తెలియజేస్తారు. కానీ సుమా మాత్రం నా రేంజ్ ఇదేనండి అంటూ కౌంటర్లు వేస్తోంది. ఇక ఓ పెళ్ళి చీరను చూపించి దీని రేటు రెండు లక్షల రూపాయలు అని చెబుతారు.. దీంతో సుమ వామో అనుకుంటూ రాజా మనం పెళ్లి చేసుకుందామా? రెండు లక్షల? అంటూ షాక్ అవుతుంది మా పెళ్లి చీర ధర రూ.11 వేలే అంటూ అంతే ఖర్చు పెట్టామని తెలియజేసింది.