టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం భారీ ప్రాజెక్టుల దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలతో పలు సినిమాలు నిర్మించి తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తో కూడా గర్వించదాక సినిమాని తలకెక్కిస్తున్నాడు ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ అత్యధిక భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 170 కోట్లు రూపాయలకు పైగా తెరకెక్కిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా బడ్జెట్ పెరిగే అవకాశం కూడా ఇంకా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే అనధికారికంగా శంకర్ సినిమాని పూర్తి చేయడానికి చాలా కష్టపడుతున్నాడు.


ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజు మరొక స్టార్ డైరెక్టర్ మురగదాస్ ను కలవడం జరిగింది దీంతో ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే వీరు ఈ మీటింగ్ కి సంబంధించిన విషయం ఏంటని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఏదైనా క్యాజువల్ మీటింగా లేక ఏదైనా సినిమా ఆలోచన అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక మురగదాస్ సినిమా చేసి ఇప్పటికి రెండు సంవత్సరాలు కావస్తోంది. దర్బార్ సినిమా తర్వాత ఇంతవరకు కొత్త ప్రాజెక్టు ఏది ప్రకటించలేదు.

విజేత సినిమా చేద్దామనుకున్నప్పటికీ అది అంతగా కుదరలేదు ఈ నేపథ్యంలోని అదే కథ తో  హీరో శింబు తో తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం. అయితే తాజాగా దిల్ రాజుతో మురగదాస్ ఏదైనా సినిమాని ప్లాన్ చేస్తున్నారా అన్న సందేహం కూడా ఎదురవుతోంది అభిమానులలో.. ఇక మురగదాస్ సక్సెస్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ హీరోలందరికి బ్లాక్ బాస్టర్ అందించారు కానీ టాలీవుడ్లో స్టాలిన్ సినిమాతో చిరంజీవికి కూడా మంచి విజయాన్ని ఇచ్చారు కానీ మహేష్ బాబుకు మాత్రం స్పైడర్ సినిమాతో భారీ డిజాస్టర్ ఇచ్చారు. ఇక ఇప్పుడు కోలీవుడ్ అంత టాలీవుడ్ వైపు చూస్తున్న తరుణంలో దిల్ రాజు మురగదాస్ కలిసి ఏదైనా సినిమా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం నిజమో కాదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: