రీసెంట్గా సర్కార్ వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా ఒక సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాక ఎన్నో సంవత్సరాలు పైన అవుతోంది మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వచ్చి చివరిగా ఖలేజా వంటి సినిమాతో మెప్పించలేకపోయాడు మహేష్ బాబు కానీ ఈ సినిమా బుల్లితెరపై మంచి టీఆర్పి రేటింగ్ మాత్రం సొంతం చేసుకున్నది. అయితే ఇప్పుడు తాజాగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో మహేష్ బాబును చూపించబోతున్నారు అనే టాక్ తెలుగు ఇండస్ట్రీలో చాలా వైరల్ గా మారుతోంది.


మహేష్ ఇటీవల సర్కారు వారి పాట సినిమా లో చాలా లాంగ్ హెయిర్ తో స్టైలిష్ గా కనిపించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు మొన్న ఆమధ్య మహర్షి సినిమాలో కూడా గడ్డంతో కనిపించి అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ సినిమాలో మహేష్ ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది త్రివిక్రమ్ కాంబినేషన్లో మహేష్ చేస్తున్న సినిమా పూర్తిగా యాక్షన్ , ఎంటర్టైన్మెంట్ అన్నట్లుగా తెలుస్తోంది రీసెంట్గా మహేష్ బాబు కూడా ఈ సినిమా పైన స్పందిస్తూ.. త్రివిక్రమ్ కానీ నేను కానీ ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి కథ చేయలేదు అని తెలిపారు.


ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారుతుంది రీసెర్టుగా మహేష్ లుక్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది లాంగ్ హెయిర్ తో గడ్డం రఫ్ లుక్ తో కనిపించడం జరిగింది. తాజాగా మహేష్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు. త్రివిక్రమ్ మహేష్ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ల పూజా హెగ్డే సెకండ్ హీరోయిన్గా శ్రీలీల నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: