అయితే ఇదంతా కేవలం మిరాకిల్ అని చెప్పవచ్చు ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కార్తికేయ-2 సినిమా మాత్రం సక్సెస్ కావడంలో నూరు శాతం అయ్యిందని చెప్పవచ్చు పాన్ ఇండియా కేటగిరీలో విడుదలైన ఈ సినిమా అన్ని భాషలలో బాగా దూసుకుపోతోంది బాలీవుడ్లో సైతం సినిమా ప్రతిరోజు పుంజుకుంటూనే ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక అక్కడ ప్రతిరోజు థియేటర్ల సంఖ్య పెరుగుతూ ఉన్నట్లుగా సమాచారం పుష్ప తరహాలో అక్కడ కార్తికేయ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద మిరాకిల్ జరుగుతోందని చెప్పవచ్చు.
ఇక బాలీవుడ్ లో కూడా లాల్ సింగ్ చాద్ద, రక్షాబంధన్ వంటి సినిమాలు విడుదలవ్వగా అంతగా ఆకట్టుకోలేకపోయాయి..దీంతో బాలీవుడ్ ఆశలన్నీ కేవలం విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా పైనే ఉన్నట్లుగా సమాచారం. ఇక బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కావడంతో పాటు ఈ సినిమాని నిర్మాణంలో కూడా కరణ్ జోహార్ ఉండడం గమనార్హం. అయితే ఈ సినిమా కంటే ముందు కార్తికేయ -2 సినిమా హిందీలో విడుదలై మంచి విజయాన్ని అందుకోవడం జరుగుతుంది. దీంతో విజయ్ దేవరకొండ క్రెడిట్ ని మొత్తం నిఖిల్ కొట్టేస్తున్నాడని టాక్ వైరల్ గా మారుతోంది.