ఇక త్వరలోనే ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా మొదలుకానుంది. అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమాలోని ఇద్దరు స్టార్స్ నటించబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి అందులో తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక తాజాగా విక్రమ్ సినిమాతో విలన్ గా మెప్పించిన ఈయన మొదటి చిత్రం ఉప్పెనతో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక పుష్పార్టులోను కూడా పవర్ ఫుల్ విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి అందుకు సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన త్వరలో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా విజయ్ సేతుపతి ప్రచార వార్తలపై యువరాజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది. విజయ్ సేతుపతి కేవలం షారుఖ్ ఖాన్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న జవాన్ చిత్రంలో మాత్రమే ప్రతి నాయకుడుగా నటిస్తున్నారని మరి సినిమాలో నటించడం లేదని విషయాన్ని క్లారిటీ ఇచ్చారు దీంతో పుష్పాటూలు విజయ్ సేతుపతి నటించడం లేదని అది కేవలం రూమర్ అన్నట్లుగానే తెలుస్తోంది. అయితే దీంతో అల్లు అర్జున్ అభిమానులు విజయ్ శేతుపతి అభిమానులు కాస్త నిరుత్సాహ చెందారని చెప్పవచ్చు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఏ హీరో నటిస్తాడో అనే విషయంపై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.