తాజాగా నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.అయితే ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ముందుకు వెళుతుంది. ఇదిలావుంటే ఇక అయితే ఈ సినిమా నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది.కాగా అలా వాయిదా పడుతూ రావడానికి గల కారణం థియేటర్లు దొరకకపోవడమే అని తన లాంటి ఒక హీరోకి కూడా థియేటర్లో దొరకవు అనే విషయం తనకు ఈ సినిమాతోనే తెలిసిందని నిఖిల్ సిద్ధార్థ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

అయితే తన సినిమాని ఆగస్టులో కూడా విడుదల చేసుకోవద్దని ఇంకా ఇంకా వెనక్కి వెళ్లాలని సూచించాలని థియేటర్లో దొరకవు అని భయపెట్టారు అని ఆ సమయంలో తాను ఏడ్చానని కూడా ఆయన సదరు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లు అన్నీ కూడా నలుగురు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందులో ప్రముఖంగా వినిపించే దిల్ రాజు పేరు కూడా ఈ విషయంలో వినిపించింది. అంతేకాదు ఆయన వల్లే ధియేటర్లు దొరకలేదని ప్రచారం జరిగింది. ఇదిలావుంటే ఇక ఈ విషయం మీద తాజాగా నిఖిల్ సిద్ధార్థ స్పందించాడు.

 ఏంటంటే...ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయంలో దిల్ రాజు గారి ప్రమేయం అసలు ఏమీ లేదని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ విషయంలో నిర్ణయాలు తీసుకుందని ఆయన చెప్పకువచ్చారు. అయితే దిల్ రాజు ఒక్కరే సినిమా వాయిదా వేసుకోమని కోరలేదని సుమారు 20 నుంచి 30 మంది నిర్మాతలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.అంతేకాదు అసలే ప్రజలు థియేటర్లకు రావడం లేదు ఇలాంటి సమయంలో పోటాపోటీగా రెండు మూడు సినిమాలు విడుదల చేస్తే జనాలు కన్ఫ్యూజన్లో పడితే కనుక ఏ సినిమాకు కూడా పూర్తిస్థాయి వసూళ్లు రావని వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని నిఖిల్ సిద్ధార్థ చెప్పుకొచ్చారు. సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి కాబట్టి 52 సినిమాలే విడుదల చేయాలి అనుకోవడం కూడా సరైనది కాదనేది తన అభిప్రాయం అని నిఖిల్ చెప్పుకొచ్చారు.ఇకపోతే  సినిమాల్లో పోటీ ఉండాలని అలా ఉంటేనే ప్రేక్షకులు కూడా ఆసక్తికరంగా థియేటర్లకు వస్తారని నిఖిల్ సిద్ధార్థ అభిప్రాయపడ్డాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: